Thursday, April 25, 2024

iPhone 16 | ఐఫోన్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌..! 16 సిరీస్‌లో రెండు కొత్త మోడల్స్‌ను తేనున్న ఆపిల్‌..!

మొబైల్‌ల్స్‌లో ఆపిల్‌ ఫోన్లకు ఆ క్రేజే వేరు. గతేడాది మార్కెట్‌లోకి ఆపిల్‌ కంపెనీ ఐఫోన్‌ 15 సిరీస్‌ని లాంచ్‌ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటిని తెగ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ ఐఫోన్‌ 16 సిరీస్‌పై పని చేస్తున్నది. అయితే, 16 సిరీస్‌కు సంబంధించి మోడల్స్‌, ధరలు గురించి ఓ నివేదిక వివరాలను వెల్లడించింది. ఐఫోన్‌ 16 సిరీస్‌లో కొత్తగా ఐదు మోడల్స్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తున్నది. టెక్​ ఇన్​సైడర్​ మజిన్​బు నివేదిక ప్రకారం.. 16 సిరీస్‌లో ఎస్‌ఈ వేరియంట్‌ ఉండబోతున్నట్లుగా పేర్కొంది.

ఐఫోన్​ 16 ఎస్​ఈ 128జీబీ ర్యామ్​ ధర 699 డాలర్లుగా ఉంటుంది సమాచారం. భారతీయ కరెన్సీలో రూ.58వేలు. ఐఫోన్​ 16 ప్లస్​ ఎస్​ఈ 256 జీబీ వేరియంట్​ ధర 799 డాలర్లు (రూ.66,300). బేసిక్‌ ఐఫోన్‌-16 256 జీబీ వేరియంట్​ ధర 699 డాలర్లు (సుమారు రూ.58వేలు). ఐఫోన్​ 16 ప్రో 256జీబీ వేరియంట్​ ధర 999 డాలర్లు (రూ.82,900). ప్రో మ్యాక్స్​ 256జీబీ వేరియంట్​ ధర 1099 డాలర్లు (సుమారు రూ.91,200) ఉంటుందని అంచనా. అయితే, ఇప్పటి వరకు ఐఫోన్‌-16 ధరపై ఆపిల్‌ కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.

ప్రస్తుతం ధరతో పాటు ఫీచర్లపై పలు రూమర్స్‌ బయటకు వస్తున్నాయి. అయితే, రూమర్స్‌లో విశేషమేంటంటే.. ఈ సారి ఆపిల్‌ సిరీస్‌లో కొత్త మోడల్స్‌ ఉండడం. అవి ఐఫోన్‌-16 ఎస్‌ఈ, ఎస్‌ఈ ప్లస్‌ ఉన్నాయి. ఇందులో డిస్‌ప్లే 6.1, 6.7 ఇంచెస్‌ ఉంటాయని, డైమనిక్​ ఐలాండ్​ నాచ్‌తో రానున్నట్లు తెలుస్తున్నది. ఐఫోన్​ 16, 16 ప్రో మోడల్స్​లో 6.3 ఇంచ్​ డిస్​ప్లే ఉండే అవకాశాలున్నాయి. ఐఫోన్​ 16 ప్రో మ్యాక్స్​లో 6.9 ఇంచ్​ భారీ డిస్​ప్లే ఉంటుందని టాక్‌.

కెమెరా కాన్ఫిగరేషన్స్​లో 16 ఎస్​ఈ మోడల్స్​లో సింగిల్​ పిల్​ షేప్​లో రేర్​ కెమెరా ఉండొచ్చని, ఐఫోన్​ ఎక్స్​లో ఇదే ఉంటుందని తెలుస్తున్నది. స్డాండర్డ్​ ఐఫోన్​ 16లో డ్యూయెల్​ కెమెరా సెటప్​.. ప్రో మోడల్స్​లో ట్రిపుల్​ కెమెరా సెటప్​ ఉండే అవకాశాలున్నాయి. ఐఫోన్​ 15 ప్రో, ప్రో మ్యాక్స్​లో సైతం ఇవే ఉన్నాయి. అయితే, ఫీచర్స్‌, ధరపై ఇప్పటి వరకు కంపెనీ అధికారికంగా స్పందించలేదు. ఖండించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్​లో ఐఫోన్​ 16 సిరీస్​ లాంచ్‌ చేయనున్నది.

Related Articles

Latest Articles