Saturday, April 27, 2024

సారలమ్మ రాక కోసం భక్తుల ఎదురుచూపులు..

బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దె మీదకు రానున్న నేపథ్యంలో మేడారానికి భక్తుల తాకిడి పెరిగింది.తలుచుకుంటేనే కరుణించే తల్లులు సమ్మక్క సారలమ్మలు. అట్లాంటి తల్లుల దర్శనం కోసం దేశం లోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. అమ్మదేవతలు ఎప్పుడు గద్దెలకు వస్తారా అని వేచి చూస్తున్న భక్తులు ఎంతో మంది ఉన్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దె మీదకు రానున్న నేపథ్యంలో మేడారానికి భక్తుల తాకిడి పెరిగింది. వేకువజామున నుండే భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిటకిట లాడుతున్నాయి. క్యూ లైన్ లన్ని నిండి పోయాయి. వనదేవతల రాక సందర్భంగా సర్వాంగ సుందరంగా గద్దెల ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. ప్రధాన ద్వారం వద్ద వివిధ రకాల పూలతో ఏర్పాటు చేసిన అమ్మ వారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంటుంది. ఎండోమెంట్, రెవెన్యూ, పోలీస్, ఫైర్, సింగరేణి రెస్క్యూ, ట్రాన్స్ కో, పంచాయతీ రాజ్ అధికారులు గద్దెల వద్ద అమ్మవారి సేవలో తరించిపోతున్నారు. గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారాన్ని సానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు తీసివేస్తున్నారు.

లక్మీపూరం నుండి మేడారం బయలుదేరిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు

లక్మీపూరం నుండి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. ములుగు జిల్లా లక్మీపురం, మొద్దులగూడెంలో గిరిజన సంప్రదాయ పద్దతిలో స్వాగతం పలుకుతున్నారు. భారీ బందోబస్త్ మధ్య పగిడిద్దరాజు శోభయాత్ర సాగుతున్నది. మరికొద్దిసేపట్లో పగిడిద్దరాజు శోభయాత్ర పస్రాకు చేరుకొనున్నది. సాయంత్రం నాలుగుగంటలకు ముందే గద్దె మీదికి చేరుకుంటారు.

పారిశుధ్యం మెరుగుకు అత్యంత ప్రాధాన్యత

మేడారం పరిసర ప్రాంతాలు స్వచ్ఛ పర్యవేక్షణ స్థలాలుగా మారాయి. ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ప్రత్యేక చొరవతో జిల్లా పంచాయతీ విభాగం ద్వారా జాతరలో పారిశుధ్యం మెరుగుకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. ఆలయ ప్రాంగణంతో పాటు భక్తులు దర్శనానికి వెళ్లే సెక్టార్లు, 4 వేలమంది పారిశుద్ధ్య కార్మికులను నియమించి పరిశుభ్రంగా ఉంచుతూ మేడారం పరిసరాలు స్వచ్ఛ పర్యవేక్షణ స్థలాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి భక్తులే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నారు. మంగళవారం మేడారం సమ్మక్క సారలమ్మ మహజాతర అమ్మవార్లను దర్శించుకునే ఆలయ ప్రాంగణం ముందు భాగంలో పారిశుధ్యం కార్మికులు పరిశుభ్రం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అతిధులు ఎక్కువగా సందర్శించే ప్రాంతం కావడం అధికారులు నిరంతరం పర్యవేక్షించి పారిశుధ్యం పై చర్యలు తీసుకోవడంపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles