Saturday, April 27, 2024

Solar Eclipse | ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఎప్పుడంటే..?

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్‌ 8న ఏర్పడనున్నది. ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం 9.12 గంటలకు ప్రారంభమై.. అర్ధరాత్రి 1.25 గంటల వరకు కొనసాగనున్నది. దాదాపు 4.25గంటల పాటు సూర్యగ్రహణం కనిపించనున్నది. అయితే, ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు. అయితే, సూతకం కాలం ఉండదు. కెనడా, అమెరికా, మెక్సికో మీదుగా ఉత్తర అమెరికాను దాటనున్నది. ఈ సూర్యగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, ఉత్తర అమెరికా, నైరుతి యూరప్, దక్షిణ అమెరికా, దక్షిణ ధృవం, ఉత్తర ధ్రువంలో కనిపించనున్నది.

చైత్రమాసంలోని కృష్ణ పక్షం అమావాస్య రోజున తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం అక్టోబర్‌ 2న ఏర్పడనున్నది. రాత్రి 9.13 గంటలకు ఏర్పడి తెల్లవారు జామున 3.17గంటలకు కొనసాగుతుంది. ఈ గ్రహణం సైతం భారత్‌లో కనిపించదు. అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహా సముద్రం ప్రాంతంలో కనిపించబోతున్నది. మరో వైపు ఈ ఏడాది సైతం రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. మార్చి 25న పెనుంబ్రల్‌ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆఫ్రికా, ఫసిఫిక్ మహాసముద్రంలో కనిపించనున్నది. రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న ఏర్పడుతుంది. ఇది సైతం భారత్‌లో కనిపించదు. యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికా ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ ఏడాది రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు కనిపించనుండగా.. భారత్‌లో కనిపించవు. అయితే, గ్రహణ సూతకం చెల్లదని జ్యోతిష్య పండితులు తెలిపారు.

Related Articles

Latest Articles