
విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ కోలా గురువులు గారికి మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు మరియు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.
పార్టీ విజయం కోసం శ్రమిస్తాను… వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు
విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ కోలా గురువులు గారు మొట్టమొదటి సారిగా మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీని గెలిపించేందుకు పూర్తి కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభ్యున్నతికి పాటు పడతానన్నారు.
రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారినీ ముఖ్యమంత్రి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని వైసిపి విజయం సాధించేందుకు సన్నద్ధమవుతామని చెప్పారు.
శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ను దర్శించుకున్న శ్రీ కోలా గురువులు గారు

విశాఖ జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు గా, జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (డిసిసిబి) చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ కోలా గురువులు గారు నగరంలో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ను దర్శించుకున్నారు. ఆలయ కమిటి సభ్యులు గురువులు గారికి సాదరంగా స్వాగతం పలికి ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు.