
పాడేరు నియోజకవర్గ తెలుగుదేశంలో నూతన ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన గిడ్డి ఈశ్వరి
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి పాడేరు మాజీ శాసన సభ్యులు , ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారికి ప్రశంసలు లభించాయి. నియోజకవర్గంలో కార్యకర్తలను సమన్వయ పరచడంలోనూ, పార్టీ పునఃనిర్మాణం, పార్టీ బలోపేతం, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం…ఇలా అన్ని విషయాల్లోనూ పాడేరు నియోజకవర్గం మూడో స్థానంలో నిలవడంపై చంద్రబాబు ప్రశంసించారు. బుధవారం విశాఖలోని జరిగిన ప్రాంతీయ సదస్సులు శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మొదటి స్థానంలో విశాఖ దక్షిణం, రెండో స్థానంలో భీమిలి, మూడో స్థానంలో పాడేరు నిలవడంతో గిడ్డి ఈశ్వరి గారిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వీరి మాదిరిగా పని చేయాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. పాడేరు నియోజకవర్గ తెలుగుదేశంలో నూతనోత్సాహంఅధినేత నుంచి లభించిన ప్రశంసలతో పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలో నూతనోత్సాహం కనిపించింది. తమ నాయకురాలను ప్రాంతీయ సదస్సు వేదికగా ప్రశంసించడంపై గిడ్డి ఈశ్వరి గారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో పునఃనిర్మాణం ఎలా జరిగింది? అందులో గిడ్డి ఈశ్వరి గారి పాత్రపై ఇప్పుడంతా చర్చ జరుగుతుంది. పాడేరులో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ఈశ్వరిగారు అడుగులు ఎలా పడ్డాయి?. ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్నా ఇబ్బందులు, అవమానాలు…అదే తరుణంలో ఆమెకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు గురించి చర్చలు జరుగుతున్నాయి.
పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాధుడే లేని సమయం… ఇక పార్టీ ఈ నియోజకవర్గంలో బతికే పరిస్థితి లేదు…అని పార్టీ శ్రేణులన్ని డీలా పడిపోయి నీరసించిపోయిన సమయంలో గిడ్డి ఈశ్వర గారు పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆమె పార్టీలో చేరిన వెంటనే తెలుగుదేశం పునఃనిర్మాణం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేశారు. కానీ ఇక్కడ పార్టీ నిర్మాణం చేయడానికి గ్రామ స్థాయిలో బలోపేతానికే తన సమయం అంతా వెచ్చించాల్సి వచ్చింది. నియోజకవర్గ వైశాల్యం ఎక్కువగా ఉండడం కొన్ని ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితితో 2019 ఎన్నికల్లో ఆశించిన స్థాయి ఫలితాలు రాబట్టలేకపోయారు. అయినా అధైర్య పడకుండా కార్యకర్తలకు భరోసాగా ఉంటూ ప్రతి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్లగలిగారు. దానిలో భాగంగా గ్రామీణ స్థాయి నుంచి మండలం, క్లస్టర్, నియోజకవర్గ స్థాయి వరకూ తెలుగుదేశం పార్టీ శాఖలు, అనుబంధ విభాగాలకు బాధ్యులను నియమించుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఒక పక్క పార్టీ నిర్మాణం చేసుకుంటూనే మరో పక్క ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై నియోజకవర్గం అంతా నిరసన తెలిపేవారు. ఈ తరుణంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని పాడేరు నియోజకవర్గంలో ఇంటింటా తీసుకెళ్లడంలో గిడ్డి ఈశ్వరి గారు విజయం సాధించారు. తమ అధినేత ఆ కార్యక్రమం పిలుపునిచ్చిన దగ్గర నుంచి నేటి వరకూ నిరంతరం నియోజకవర్గంలో ఏదొక ప్రాంతంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి చేస్తూనే ఉండేవారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లోనూ కార్యకర్తలే స్వయంగా ఈ కార్యక్రమాలు చేసేలా వారిలో గిడ్డి ఈశ్వరి గారు చైతన్యం తీసుకురాగలిగారు. మైదాన ప్రాంతాల్లో కూడా సాధించలేనటువంటి ఫలితాలను గిరిజన ప్రాంతంలో గిడ్డి ఈశ్వరి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సాధించగలిగింది. అందుకనే అధినేత దగ్గర నుంచి ప్రశంసలు లభించాయి. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి తో పాటు అన్ని అంశాలలోనూ పాడేరు నియోజకవర్గం మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానం విశాఖ దక్షిణ నియోజకవర్గం, రెండో స్థానం భీమిలి మూడో స్థానం పాడేరు నియోజకవర్గం నిలవడంతో బుధవారం విశాఖపట్నంలోని జరిగిన ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశంలో అధినేత ద్వారా ప్రశంసలు లభించాయి.

చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసే వరకు శ్రమిస్తూనే ఉంటాం ః గడ్డి ఈశ్వరి
ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకతను ఈ రోజు ప్రజలంతా గుర్తించారని పాడేరు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గడ్డి ఈశ్వరి గారు అన్నారు. ఆయన అనుభవంతో కూడినటువంటి పాలన ఈ రోజు రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారిని ఆదరించకపోవడం వల్ల రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని పూరించడం కోసం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం శ్రేణులు శ్రమిస్తున్నాయని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేవరకు పాడేరు నియోజకవర్గంలో రాష్ట్ర మొత్తం మీద అత్యధిక మెజారిటీ ని సాధించేవరకూ తాను, తన శ్రేణులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని ఈశ్వరి గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి దగ్గర ప్రశంసలు పొందినందుకు కారణమైన పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నిర్మాణంలోని పార్టీ కార్యక్రమాల్లోని చురుగ్గా పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు అభినందనలు తెలిపారు. తెలిపారు