Monday, September 25, 2023
Google search engine
Homeప్రత్యేకంమ‌హిళ‌ల‌దే కీలకం…

మ‌హిళ‌ల‌దే కీలకం…

సృష్టి కారకుల్లో మూలమైన వ్య‌క్తి మహిళ…ఆ మ‌హిళకు అగ్ర స్థానం ఉండాల్సింది పోయి అథ‌మ స్థానంలో వంటగదికి పరిమితమైపోయింది… మా హక్కులను కాలరాస్తున్నారు… మా స్వాతంత్రయాన్ని అణ‌గదొక్కేస్తున్నారని ఎంతోమంది మహిళామణులు కొన్ని ద‌శాబ్దాల కాలం నుంచి పోరాడుతూనే ఉన్నారు… సావిత్రిబాయి పూలే గారు, సరోజినీ నాయుడు గారు, అయ్యల సోమయాజులు లలిత గారు… గాని ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఆ జాబితాలో ఉన్నారు …. మహిళలకు స్వతంత్రం కావాలి… వంటగదికి పరిమితం చేయొద్దు… అద్భుత స‌మాజ నిర్మాణం మ‌హిళ‌తోనే సాధ్య‌మవుతుంద‌ని… తమ గొంతుని ఈ ప్రపంచానికి వినిపించేటట్టు స్వేచ్చా స్వతంత్రాలు కావాలని పోరాడిన వీర వనితలు అనేకమంది…. అందులో గురజాడ అప్పారావుగారు, కందుకూరి వీరేశలింగం గారు వంటి పురుష రచయితలు కూడా ఉండడం విశేషం. మానవ సృష్టిలో ప్రధాన పాత్ర పోషించే మహిళలు తమ హక్కుల కోసం పోరాటం చేసే పరిస్థితి ఈ సమాజం తీసుకురావడం దురదృష్టమో ….అదృష్టమో కానీ భారతదేశంలో తొలిసారిగా అహ్మదాబాద్ లో అనసూయ సారాభాయ్ టెక్స్ టైల్స్ లేబర్ అసోసియేషన్ పేరుతో ఒక కార్మిక సంఘం ప్రారంభమైంది. అది కేవలం మహిళా హక్కుల కోసం పోరాటం చేసేటువంటి అసోసియేషన్. అది భారత కార్మికుల ఉద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటన చేసి తొలి ద‌శ‌లో మహిళా సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖ మహిళా నేత‌లు ఈ పోరాటానికి నాంది ప‌లికారు. వారి చేసిన పోరాట ఫలితంగానే స్వతంత్రం తర్వాత కార్మికుల బతుకులు మెరుగయ్యాయి…. కార్మికుల పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి చట్టాలు చేయాల్సినటువంటి అవసరాలు పాలకుల ఏర్పడింది.

     1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాలు ప్రభావం వలన ప్రవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాలు అమలు కుంటుపడుతున్నది.... దీనికి వ్యతిరేకంగా పోరాటాల్లో మహిళలు పాల్గొనడం...వాటికి నేతృత్వం వహించడం ఇంకా మెరుగుపడాల్సింది. దుర‌దృష్టం ఏమిటంటే ఆ త‌ర‌హా భావం జాలం ఉన్న వ్య‌క్తుల‌పై చ‌ట్టాల‌ను ప్ర‌యోగించి పాల‌కులు బ‌ల‌హీన ప‌రుస్తుండ‌డం ప్ర‌మాద‌క‌ర ఘంటిక‌లు గానే చెప్పొచ్చు... ఇప్పటికీ దేశవ్యాప్తంగా మహిళలు లింగ వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు అయినా ఇంకా సమాన హక్కులు సమాన అవకాశాల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది... వీటి సాధ‌న‌కు సరైన మార్గం విద్య ఒక్కటే అన్నది స్పష్టం... గ్రామీణ మహిళా సాధికారత, పేదరికం, ఆకలి నిర్మూలన అనేది స్త్రీ వయోజన విద్యతోనే సాధ్యమవుతుంది. మారుతున్న పరిస్థితుల్లో చట్టాలలోని నిబంధనలో... రాజకీయ ప్రాబల్యం కోసమో ... ఏదైనాప్పటికీ ఇప్పుడిప్పుడే మహిళకు కొద్దిపాటి అవకాశాలు లభిస్తున్నాయని మనం చెప్పాలి. ఏది ఏమైనా మహిళలకు వచ్చినటువంటి అవకాశాలను వాళ్ళ శక్తి మేరకు కొంతమంది వినియోగించుకోగలుగుతున్నారు... కొన్నిచోట్లా.... కొందరు విషయాల్లో మాత్రం పదవులలో మహిళలే ఉంటున్నా స‌రే... ఆదిపత్యం మాత్రం పురుషులదే అవుతుంది ఈ ధోరణి పోవాలని ఆకాంక్షించాలి...  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌ల‌కు అగ్ర‌తాంబూల‌మే ఇస్తోంది ఇక్క‌డి ప్ర‌భుత్వం... మ‌హిళా ర‌క్ష‌ణ కోసం ప్ర‌త్యేకంగా దిశా చ‌ట్టాన్నే రూపొందించి కొత్త శ‌కానికి నాందిప‌లికారుజ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గారు. మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌త దిశ‌గా మ‌రో అడుగు ముందుకేస్తూ...అమ్మ ఒడి, జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌, వైయ‌స్సార్ భ‌రోసా ద్వారా మ‌హిళ‌ల‌కు ఆర్థిక చేయూత‌నిస్తున్నారు. ఇక మ‌హిళ‌ల‌కు మ‌రింత చేయూత‌నివ్వాల‌ని అనే ఉద్దేశంతో ఆడ‌పిల్ల‌కు చ‌దువు ప్రాధాన్య‌త‌ను అనుసంధానం చేసిన విధానానికి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. అయితే అదే విద్య మెరుగుప‌డ‌డానికి ముఖ్యంగా అమ్మాయిల కోసం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప్ర‌త్యేక మ‌రుగుదొడ్ల నిర్మాణ‌మూ ఓ విజ‌య‌మే...వారి విద్యాభివృద్ధికి ప్రోత్సాహ‌మే... ఇక గిరిజ‌న ప్రాంతంలో గిరిజ‌న మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక బ‌ర్త్ వెయింట్ హాల్స్ అనేవి ఏర్పాటు కూడా స్త్రీ అభ్యున్న‌తి కోసం ఏర్పాటు చేసిన సౌక‌ర్యంగానే చెప్పొచ్చు...

రాజ‌కీయంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌హిళ‌కు అగ్ర‌స్థాన‌మే ఇచ్చారు…త‌న‌తో స‌మానంగా అణ‌గారిని గిరిజ‌న మ‌హిళ‌కు డిప్యూటీ సీఎం స్థానం క‌ల్పించిన ఘ‌న ఇక్క‌డ ప్ర‌భుత్వానిదే… ఆ త‌ర్వాత మంత్రిత్వ శాఖ‌లోనూ ప్రాధాన్య‌మిచ్చిన విష‌యం తెలిసిందే. అల్లూరి జిల్లా గిరిజన మ‌హిళ‌కు చెందిన వెనుబ‌డిన తెగ‌కు చెందిన స్త్రీకి మూడు జిల్లాలో ఉండే ఏకైక‌ అత్యున్న‌త ప‌ద‌విని బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించి చ‌రిత్ర సృష్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే జీసీసీలోనూ, పార్ల‌మెంట్‌లోనూ శాస‌న స‌భ‌ల్లోనూ ప్ర‌వేశం క‌ల్పించడం శుభ‌ప‌రిణామం..భ‌విష్య‌త్ మ‌హిళ‌లే చ‌ట్ట‌స‌భ‌లోనూ, న‌వ స‌మాజ నిర్మాణంలో కీల‌కం కావాల‌ని ఆశిస్తూ…అంద‌రికీ మ‌హిళా దినోత్స‌వం శుభాకాంక్ష‌లు

  • సోభా సోమేశ్వ‌రి స్వ‌చ్చాంధ్ర కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్‌
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular