విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు ని విశాఖ పార్లమెంట్ ముస్లిం మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ రహంతుల్లా, జనరల్ సెక్రటరీ మహమ్మద్ గౌస్ మర్యాదపూర్వకం గా కలవటం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ” ముస్లిం మైనారిటీలకు వైస్సార్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో చాలా అన్యాయం జరుగుతుంది . వైస్సార్సీపీ పార్టీ ఉన్న మా ముస్లిం మైనారిటీనాయకులు నోరు విప్పేయ్ పరిస్థితి లో లేరు. ముస్లిం సోదరులులకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు సక్రమంగా అందేవి. కానీ ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం జరగటం లేదు” అని తెలిపారు. శాసన సభ్యులు గా ఈ అంశాలు అన్నిటిపై గళం విప్పి, తమ ముస్లిం సోదరుల సమస్యలు పరిస్కారంనికి కృషి చేయాలి అని కోరుతున్నట్లు ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేగా విన్నవించారు.