విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం నాడు – నేడు లో భాగంగా పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ఉద్దేశించి జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర గారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందించినప్పుడే ఉత్తమ పౌరులుగా ఈ సమాజానికి పరిచయమవుతారని సూచించారు. ఉపాధ్యాయులు తమ పని తాము చూసుకుంటూ విద్యార్థులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని, విలువలతో కూడిన విద్యను అందించినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం నెరవేరుతుందని చెప్పారు. ఒకప్పుడు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కూడా సరైన సదుపాయాలు లేని పరిస్థితి అని, నేడు ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ సకల సదుపాయాలతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చి దిగినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిదని ఆమె తెలిపారు. ప్రభుత్వం అత్యధికంగా విద్యా, వైద్యంపైనే ఖర్చు చేస్తుందని ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేసేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.
