
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అగ్రస్థానం అన్న పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పాడేరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు అందరినీ దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌లో మహిళలకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రస్థానం ఇచ్చిందని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా మహిళ ఆర్థిక సాధికారతవైపు దూసుకెళ్లే విధంగా ఆర్థిక పురాభివృద్ధి చెందే విధంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మహిళకు ముఖ్యమంత్రి పక్కన స్థానం ఇచ్చినటువంటి సందర్భాలు లేవని అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గిరిజన మహిళను ఉపముఖ్యమంత్రిని చేసిన ఘన ఉందని చెప్పారు. అంతేకాకుండా మహిళకే ప్రథమ ప్రాధాన్యమిస్తూ రాజ్యాంగ బద్ధ పదవుల్లో నియమించడం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ కి దక్కిందని పేర్కొన్నారు. ఆర్థిక సాధికారతవైపు తీసుకెళ్లే విధంగా అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైయస్సార్ ఆసరా వంటి పథకాలను అమలు చేసి వారిని ఆర్థిక తోడ్పాటుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఆలోచనతో పాఠశాల విద్యలో వినూత్న సంస్కరణను తీసుకువచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు.