
ప్రజలకు అండగా ఉండాలంటూ సిబిఎన్ కనెక్ట్ కార్యక్రమంలో శ్రేణులకు సూచించిన చంద్రబాబు నాయుడు గారు
చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి పాడేరు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో హాజరైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
….. …… …… …… …… ….. ……
జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల విధ్వంసం చేస్తున్నారని వాటిని కాపాడేందుకు ప్రతిపక్షాలైన తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ముందుండి పోరాటం చేయాలని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు సూచించారు. సిబిఎన్ కనెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఆయన బుధవారం టీడీపీ శ్రేణులను ఉద్దేశించిన నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ పార్టీ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారి స్వగృహంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పలు సూచనలు చేశారు. ప్రజల తరఫున ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు చర్యలను ఖండించేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించినప్పుడు ప్రతిపక్షాలే ఆ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని బాబు గారు తెలిపారు. ఈరోజు ప్రజలంతా భయభ్రాంతులతో బ్రతుకుతున్నారని ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం ఉందనే భరోసాను జనాలకు కల్పించే బాధ్యత శ్రేణులదేనిని ఆయన సూచించారు.

