Thursday, September 21, 2023
Google search engine
Homeగిరిజనంఘనంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారి జన్మదిన వేడుకలు

కేక్ క‌ట్ చేస్తున్న పాడేరు ఎమ్మెల్యే కొట్ట‌గుళ్లి భాగ్య‌ల‌క్ష్మి



పాడేరు శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పాలకమండల సభ్యులు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారి జన్మదిన వేడుకలు బుధవారం పాడేరులో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అరకు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి గొడ్డేటి మాధవి గారు, అరకు ఎమ్మెల్యే శ్రీ చెట్టి పాల్లుణ‌ గారి ఆధ్వర్యంలో పాడేరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు. శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారి చేత‌ అరకు ఎంపీ మాధవి గారు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి జన్మదిన వేడుక‌లు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో రాజకీయంగా అత్యంత పదవులను అలంకరించాలని ఆశిస్తూ… శుభాకాంక్షులు తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular