
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో వైయస్సార్సీపీ అభ్యర్థి శ్రీ సీతంరాజు సుధాకర్ ను గెలిపించాలని కోరుతూ పాడేరు మండలంలోని ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం పాడేరు మండలం భరిసింగి పంచాయతీకి చెందిన భరిశింగి, బూరుగుపుట్టు, గడ్డివలస, కొత్తావూరు గ్రామాలలో గ్రాడ్యూయేట్ ఓటర్లను వ్యక్తిగతం కలసి ఓట్లను అభ్యర్థించడం జరిగింది. ఫ్యాన్ గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటును వేసి సుధాకర్ గారిని గెలిపించాలని కోరడం జరిగింది. ST Cell Zonal Incharge కిముడు శ్రీనివాసు విశ్వ నాయుడు, పాడేరు మండల మాజీ అధ్యక్షులు కూడా సింహాచలం గారు, పాడేరు మండల అధ్యక్షులు రాంబాబు (D. గొందూరు సర్పంచ్), వంతల రాంబాబు (కించురుసర్పంచ్), సీదరీ సింహాచలం(భర్సింగి ex:సర్పంచ్), మరియు గృహసారదులు, కన్వీనర్లు Ysrcp సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

