
జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారికి విన్నవించిన స్థానిక ప్రజా ప్రతినిధులు, వైయస్ ఆర్సీపీ నాయకులు
వెంటనే ఫోన్ డీఈవోతో మాట్లాడిన జల్లిపల్లి సుభద్ర
వేగవంతానికి చర్యలు తీసుకుంటామని హామీ
సంగడిలో ఉన్న మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ హైస్కూల్ ను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరతగతిన పూర్తి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్రగారికి స్థానిక ప్రజా ప్రతినిధులు విన్నవించారు. గతంలో ఈ పాఠశాలను మాచ్‌ఖండ్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ నిర్వహించేదని ప్రస్తుతానికి ఈ హైస్కూల్‌ను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రక్రియను కలెక్టర్ దృష్టిలో ఉన్న నేపథ్యంలో ముంచంగిపుట్టులో శ్రీమతి జల్లిపల్లి సుభద్రగారి ఆమె స్వగృహం వద్ద కలసి విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. విలీన ప్రక్రియను వేగవంతం చేస్తూనే ఇక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయుల ఉపాధిని కూడా దృష్టిలో పెట్టుకొని వారిని సీఆర్టీలుగా నియమించి ఇదే పాఠశాలలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వందమంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో ప్రస్తుతం ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో నాణ్యమైన బోధన జరగాలంటే పాఠశాల విలీన ప్రక్రియ త్వరతగతిన పూర్తవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరారు. ఈ విషయంపై వెంటనే సుభద్ర గారు అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖాధికారి సీతారామ్ గారితో మాట్లాడారు. ఇప్పటికే కలెక్టర్ దృష్టిలో ఉందని తమకు ఆదేశాలు ఉన్నాయని వెంటనే ఆ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భాగ్యవతి, లక్ష్మీపురం ఎంపీటీసీ సాధూరామ్, సునీల్కోట సుబ్బలక్ష్మి, రంగబయలు సర్పంచ్ ధనియా, సీనియర్ నాయకులు జగబంధు, తిరుపతిరావు, సులేమాన్, రఘు, దేవ, నీలకంఠం, ప్రసాదు తదితరులు సుభద్రగారిని కలిసినవారు ఉన్నారు.
