
జనసేన అరకు పార్లమెంట్ ఇన్‌చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య
బోయవాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై గిరిజన జాతి తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 31న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం జేఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో ఇది…. ఇందులో ప్రధానంగా ఏడుగురు ఎమ్మెల్యేలను, ఎంపీని ఏక మొత్తంగా గిరిజన ప్రజలంతా వైసీపీకే మద్దతు తెలిపి గెలిపిస్తే ఆదివాసీ జాతికిచ్చిన గొప్ప బహుమతి ఇదా అని ఈ సమావేశంలో జనసేన అరకు పార్లమెంట్ ఇన్‌చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య ప్రశ్నించారు. వైసీపీ ప్రతిప్రతినిధులంతా నిజమైన గిరిజనులైతే వెంటనే అసెంబ్లీలో ప్రవేశ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

