
కార్యకర్తల సొంత నిధులతో 1500 గొడుగులకు ఆర్డర్
వైయస్ ఆర్ సీపీ ప్రభుత్వం, వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారి లక్ష్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు గానూ ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు అండ్ టీమ్ పార్టీ పేరుతో గొడుగులను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.. కార్యకర్తల సొంత నిధులతో 1500 గొడుగులకు ఆర్డర్ ఇచ్చారు. వీటిలో తొలిత శుక్రవారం 100 గొడుగులను పాడేరులోని సతక బుల్లిబాబు గారు తన క్యాంప్ కార్యాలయంలో వైయస్ ఆర్ సీపీ శ్రేణుల మధ్య విడుదల చేశారు. ఈ గొడుగుపై ఒక వైపు మా నమ్మకం నువ్వే జగన్, మరో వైప్ జగన్మోహన్ రెడ్డి గారితో సతక బుల్లిబాబు గారు దిగిన ఫొటోతో నవరత్నాల లోగోను ముద్రించారు. ఈ గొడుగు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. త్వరలోనే పాడేరు నియోజకవర్గంలోని వైసీపీ పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసే ముఖ్యమైన కార్యకర్తలకు సుమారు 1500 గొడుగులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాడేరు మండలం వైసీపీ మాజీ మండల అధ్యక్షుడు కూడ.సింహాచలం గారు ,పాడేరు టౌన్ ప్రెసిడెంట్ రాంబాబు గారు ,ఐనాడ పంచాయతీ సర్పంచ్ గారు ,ఐనాడ పంచాయతీ ఎంపీటీసీ సభ్యులు లింగాపుట్టు సర్పంచ్ గారు ,ఇరడాపల్లి ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ గారు ,పాంగి.నవీన్ గారు ,సోమేశ్ గారు ,పలాస.రామారావు గారు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

