
టిడిపి దళిత ఎమ్మెల్యేపై భౌతిక దాడితో వైసిపి రౌడియిజం సంస్కృతి మళ్లీ బయటపడింది
పెద్దలబుడు సర్పంచ్ పెట్టెలి దాసు బాబు
వైసిపి అంటేనే రౌడీయిజం అని ఆ సంస్కృతి మళ్లీ సోమవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా బయటపడిందని పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసు బాబు గారు అన్నారు. ప్రజా సమస్యలు చర్చించాల్సిన గౌరవ సభలో తెలుగుదేశం పార్టీ దళిత శాసనసభ్యులు డోలా వీరాంజనేయ స్వామి పై దాడి చేయడంతో సరికాదన్నారు. ఆ దాడికి నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర అధ్వర్యంలో మంగళవారం అరకులో నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ రాజ్యాంగ రూపకర్త విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం దాసుబాబు మాట్లాడుతూ వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి దళిత శాసనసభ్యుడిపై దాడి చేస్తుంటే స్పీకరు నిలువరించాల్సింది పోయి దాడులను ప్రోత్సహించేలా వ్యవహరించారని అన్నారు. ప్రతిపక్షాలకు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపే హక్కు ఉంటుందని అధికార పక్షానికి అక్కడ ఏం పని ఉందని ఆయన నిలదీశారు. ఆగమేగాల మీద ప్రతిపక్షాల గొంతు నొక్కాలని తీసుకొచ్చిన జీవో నెంబర్.01 రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కోరినప్పుడు దానిపై చర్చకు స్పీకర్ అనుమతించకపోవడాన్నితమ పార్టీ సభ్యులు నిరసన తెలుపుతుంటే వారిపై వైసిపి ఎమ్మెల్యేలు దాడు చేయడం సరికాదన్నారు. వైసీపీ నేతలు ప్రవర్తన మారకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో ప్రజలందరూ బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శెట్టి బాబురావు పేదలపూడి సర్పంచ్ పెట్టెల దాసు బాబు జిల్లా ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ అమ్మన్న టిడిపి నేతలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.