
- అరకులో ఆందోళనలు
- ఐటీడీఏ పీవో వాహనం అడ్డగింత
- నడుచుకుంటూ వెళ్లి పీవో గోపాల్‌కృష్ణ
- మద్దతు తెలిపిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
వైయస్సార్‌సీపీ ఈనెల 24వ తేదీన అసెంబ్లీలో బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ తీర్మానించడానికి నిరసనగా శుక్రవారం మన్యంబంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. తెల్లవారకముందే అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆదివాసీ జేఏసీ నేతలు రహదారిపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ద్విచక్రవాహనాలను సైతం రోడ్డుపై తిరగకుండా అడ్డగించారు. భారీ ఎత్తున ఆందోళన కారులు రహదారులపై వచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
అరకులో నిరసన

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ…అరకులోని ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. జేఏసీ నాయకులు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని నినదించారు. బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చొద్దంటూ నినాదులు చేశారు. ఈ కార్యక్రమంలో పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు, ఎంపీటీసీ ఆనంద్, వైసీపీ నాయకుడు బి. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

పాడేరులో రోడ్డుపైనే వంటా వార్పు….పీవో వాహనాన్ని సైతం అడ్డుకున్న జేఏసీ

జిల్లా కేంద్రం పాడేరులో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపైనే వంటావార్పు మొదలు పెట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై వెళుతున్న ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ గారి వాహనాన్ని సైతం రహదారిపై వెళ్లకుండా అడ్డగించారు. తప్పని పరిస్థితుల్లో పీవో వాహానాన్ని నిలిపేయడంతో ఆయన నడుచుకుంటూనే వెళ్లాల్సి వచ్చింది.
రిటైర్డ్ ఐఏఎస్ బాబూరావు నాయుడు మద్దతు
పాడేరులో జేఏసీ చేస్తున్న నిరసన, మన్యం బంద్‌కు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాబూరావు నాయుడు మద్దతు తెలిపారు. జేఏసీ చేస్తున్న వంటావార్పు కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదనే, వెంటనే చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
చింతపల్లిలో ఎంపీపీ, జెడ్పీటీసీ మద్దతు
గిరిజన జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న మన్యంబంద్ కు చింతపల్లి ఎంపీపీ అనూష దేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య పడాల్ తదితర వైయస్సార్సీపీ నేతలు మద్దతు తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఏజేసీ ప్రతినిధులంతా ఈ కార్యక్రమంల పాల్గొన్నారు.






