
As part of Manyam Bandh in Paderu, Alluri district center on Friday morning, Adivasi JAC is protesting CM Jagan's down down
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ ఈనెల 24న అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం (మార్చి 31) రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్‌కు ఆదివాసీ జేఏసీ పిలుపునిచ్చింది. శ్రీకాకుళం నుంచి భద్రాచలం వరకూ ఉన్న మన్యం ప్రాంతం అంతా బంద్ పాటించనుంది.
తెల్లవారక ముందే…
ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ శుక్రవారం మన్యం బంద్ నేపథ్యంలో తెల్లవారకముందే రోడ్లపైకి వచ్చేసింది. బంద్‌ను విజయవంతం చేసేలా అన్ని సన్నాహాలు చేసింది. ప్రతి ప్రాంతంలోనూ తిరుగుతూ బంద్‌కు సహకారం అందించాలని గిరిజనులను కోరింది. దీనికి గిరిజనులంతా స్వచ్చంధంగా బంద్‌ను పాటించేందుకు ముందుకొచ్చారు. ఆదివాసీ జేఏసీలో జనసేన పార్లమెంట్ ఇన్‌చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఉద్యమనేతగా ఉన్న అనుభవంతో మన్యం బంద్‌ను ఎలా విజయవంతం చేయాలనే విషయంలో కొత్త వ్యూహాలు అమలు చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారు.
వారం నుంచి ఊరూరా తిరుగుతూ…

Adivasi JAC, Dr. Vampuru Gangulayya is exhorting the people to support Manyam Bandh in Karakaput Village of Paderu Mandal, Alluri District Center.
మన్యం బంద్‌ను విజయవంతం చేసేందుకు ఆదివాసీ జేఏసీ వారం రోజుల ముందు నుంచి జిల్లా కేంద్రం పాడేరులో అనేక వ్యూహాలు అమలు చేసింది. ఊరూరా వెళుతూ కనిపించిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్న ద్రోహాన్ని వివరిస్తూ బంద్‌కు మద్దతు తెలపాలని కోరారు. దానికి ప్రతి చోటా విశేష స్పందన లభించింది.
అటు ఉద్యోగుల్లోనూ….

Adivasi JAC, Dr. Vampuru Gangulayya is exhorting the people to support Manyam Bandh in sukuruput Village of Paderu Mandal, Alluri District Cente
ఎస్టీ జాబితాలో బోయ వాల్మీ, బెంతు ఒరియాలను కలపడం వల్ల గిరిజనులకు గ్రూపు -1 , గ్రూపు 2 ఉద్యోగాల్లో కొద్దో గొప్పో నష్టం ఉండొచ్చు ఏమో గానీ మిగిలిన విషయాల్లో నష్టముండదని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు.. ఆ మాట విన్న గిరిజనులు భగ్గుమన్నారు. అసలు గిరిజనులకు లభించేవి ఉద్యోగాలేనని వాటిల్లోనే నష్టపోతే ఇంకేముందనే భావన ఆదివాసీ జేఏసీ మన్యంబంద్‌కు మద్దతు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలను కోరినప్పుడు స్పష్టంగా కనిపించింది. ఈ ఉద్యమానికి మన్యం ప్రాంతం మొత్తం స్వచ్చందంగా మద్దతిస్తున్నట్టు ప్రకటించింది.
అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మాడగడ పంచాయతీ ఏక్రగీవ తీర్మానం

Mdagad Panchayathi Body
అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎస్టీ జాబితాలో బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను కలుపుతూ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ అరకు మండలం మాడగడ పంచాయతీ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనిని తాము అంగీకరించబోమని పాలకవర్గం హెచ్చరించింది.












