Tuesday, December 5, 2023
Google search engine
Homeగిరిజనంపేద‌ల ఆర్ధిక సుస్థిర‌తే జగనన్న లక్ష్యం

పేద‌ల ఆర్ధిక సుస్థిర‌తే జగనన్న లక్ష్యం

  • పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి గారు



పేద‌ల ఆర్థిక సుస్థిర‌త సాధించ‌డ‌మే జగనన్న ల‌క్ష్య‌మ‌ని పాడేరు శాసనసభ్యులు శ్రీమ‌తి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారు అన్నారు. జీకే వీధి మండలం రింతాడ సచివాలయం -2 పరిధిలో గల జంగం పాడు, పెదపాడు, పారికల, దుచ్చరపాలెం గ్రామాలలో గురువారం గ‌డప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులకు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న స్థానికు ఆయా సమస్యలను ఎమ్మెల్యే గారికి వివరించారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజం మొత్తం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. విద్యాభివృద్ధే ప్రాథమిక అవసరమని అందుకే విద్యా విధానంలో వినూత్న‌ సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు కూడా లభించాయని , సంస్కరణ ప్రభావంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం సత్కారాల అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం నిర‌క్ష్య‌రాస్య‌త‌ అనేది లేకుండా ఉంటే అభివృద్ధి ఖచ్చితంగా సాధ్యమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా నమ్ముతుందన్న విషయాన్ని పున‌రుద్ఘాటించారు. అసమానతలు తొలగించేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాల రూపంలో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఒక్కొక్క కుటుంబం లబ్ధి పొందిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా వస్తున్నటువంటి లబ్ధితో కొంతవరకు ఆర్థిక వెసులుబాటు పేదల్లో కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి, ఎంపిటిసి ఓం ప్రకాష్, నాగరాజు , వైఎస్ఆర్సిపి ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు లక్ష్మణ్, ఎంపీటీసీ పసుపులేటి నాగమణి, సర్పంచ్ కొర్రా సుభద్ర, ఎంపీపీ బోయిన కుమారి, జెడ్పిటిసి కిముడు శివరత్నం, వైస్ ఎంపీపీలు సప్పగడ్డ ఆనంద్, లోత దేవుడు, ఏఎంసీ డైరెక్టర్ త్రిమూర్తులు, కే వీరేంద్ర ప్రసాద్, కేపీ కృష్ణారావు, బొబ్బిలి లక్ష్మి, కిల్లో ఈశ్వరమ్మ, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కె నారాయణ , అంజి, ప్రసాద్, రాజేష్, సాంబమూర్తి , రాజులమ్మ, లోవ లక్ష్మి, , వైస్ సర్పంచ్ సోమేశ్ ,ఏఎంసీ చైర్మన్ మత్స్యరాజు,నారాయణ ,సర్పంచులు కృష్ణారావు, వసుపరి ప్రసాద్, గిరి, ప్రసాద్, అంజి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular