
అరకు నియోజకవర్గంలో నాయకుల కులాలకే ప్రాధాన్యమిస్తున్నారు..
వైయస్ ఆర్ సీపీ నేతల సమావేశంలో హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం
పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం సూచించారు. డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీ ముసిరి గొంది గూడ గ్రామం వైఎస్ఆర్ సీపీ ముఖ్య నేతలతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వైయస్ ఆర్ సీపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని క్యాడర్‌ను కోరారు. పదవులు పొందిన వారు పార్టీని, శ్రేణులను విస్మరించడం సరికాదన్నారు. మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సమన్యాయం పాటిస్తున్నారన్నారు. కానీ వైయస్ ఆర్ సీపీ, జగన్‌మోహన్ రెడ్డి గారి సిద్దాంతాలకు విరుద్ధంగా అరకు నియోజకవర్గంలో నాయకులు వాళ్ల కులాల వారి ఎదుగుదలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధమైన తీరు మారకపోతే భవిష్యత్తులో అన్యాయానికి గురైన కులాలు వైయస్ ఆర్ సీపీకి దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కేటాయింపు విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా సరే… స్థానిక నాయకుల కుల రాజకీయాల వల్ల పార్టీ మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా నష్టపోయిన సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే గతానికి మించి మెజార్టీ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇది తన అభిప్రాయం కాదని ప్రజల నోటి నుంచి వస్తోందని తెలిపారు. ఈ విషయంలో అధినాయకత్వం ఆలోచన చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అరమ ఎంపిటిసి దళపతి పద్మ, దళపతి తుమనాధ్, పెదలబుడు -3 ఎంపీటీసీ సమర్ధి శత్రుజ్ఞ, కొత్త బల్లుగూడ ఎంపీటీసీ స్వాభి రామూర్తి, చిన్నలబుడు సూపర్ ఎంపీటీసీ గరం పూర్ణ, సూపర్ తాంగుల త్రినాధ్, దుర్గం సర్పంచ్ పాతూని చందన పాత్రుడు, పాత కోటసూపర్ సర్పంచ్, పాటి చిన్నయ్య, రంగశీల సర్పంచ్ తాంగుల మోహనదాస్, మెరకచింత సర్పంచ్ డిసరి వెంకట్, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.