
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరులో వెలసిన శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమవారి ఉత్సవాలకు సంబంధించి పందిరి రాట ప్రతిష్టోత్సవం శనివారం ఉదయం వేడుకగా జరిగింది. పాడేరు శానస సభ్యులు, శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారు వేదమంత్రోచ్ఛరణుల నడుమ రాటను ప్రతిష్టించారు. పాడేరులోని సతకం పట్టు వద్ద ప్రతిష్టించిన రాటకు భాగ్యలక్ష్మి , ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ తమర్భ నరసింగరావు , ఆయల ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్ళి చిట్టినాయుడు, ఉత్సవ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిన్నయ్యదొర, తమర్భ ప్రసాద్ నాయుడు, సవర కొండబాబు, సర్పంచ్ కొట్టగుళ్ళి ఉషారాణి, ఎంపీపీ కుమారి, వైస్ ఎంపీపీ కనకాలమ్మ, కొట్టగుళ్ళి సుబ్బారావులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
