Thursday, December 8, 2022

న‌క్స‌ల్స్ అడ్డా ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి

న‌క్స‌లైట్ల ప్ర‌భావిత ప్రాంతాల్లో
క‌లియ‌తిరిగిన పాడేరు శాస‌న స‌భ్యులు శ్రీ‌మ‌తి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి గారు
స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఆ గ్రామాల‌కు వెళ్లిన తొలి ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి గారు
గిరిజ‌నుల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యమ‌న్న శ్రీ‌మతి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి గారు

ఆ ప్రాంతం వెళ్లాలంటే అధికారుల‌కు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు భ‌యం….ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందోన‌నే ఉత్కంఠ ….అటువంటి చోట పాడేరు శాస‌న స‌భ్యులు శ్రీ‌మ‌తి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి గారు బుధ‌వారం క‌లియ‌తిరిగారు. మ‌న స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ ఊల్లెల‌కు వెళ్ల‌లేదు..తొలిసారి శ్రీ‌మతి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మిగారు వెళ్లి కొత్త సంప్ర‌దాయానికి శ్రీ‌కారంచుట్టారు…ఆ ప‌ల్లెల‌కు వెళ్లిన తొలి ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.
ర‌హ‌దారి సౌక‌ర్యం కూడా లేని ప్రాంతాల్లో కొండ‌లు , వాగులు, వంక‌లు దాటుతూ ప్ర‌జ‌ల యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు తీరు గురించి ఆరా తీశారు.. అవే జీకేవీధి మండ‌లం దేవ‌రాప‌ల్లి పంచాయ‌తీ గోన‌లంక‌, దేవ‌రాప‌ల్లి, రామ‌గ‌డ్డ‌, మంగ‌ళ‌పాలెం గ్రామాలు…ఈ గ్రామాల‌న్నీ న‌క్స‌లైట్ల ప్రభావం ఎక్కువ‌గా ఉన్న ప‌ల్లెలు…అటువంటి గ్రామాల‌కు గౌర‌వ‌ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేర‌కు పోలీసుల హెచ్చ‌రిక‌లను బేఖాత‌రుల చేసి మ‌రీ ఆ గ్రామాల్లో నిర్వ‌హించి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాడేరు శాస‌న స‌భ్యులు శ్రీ‌మ‌తి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి గారు పాల్గొన్నారు. అదేదో గంటో రెండు గంట‌లో కాదు…తెల్ల‌వార‌క‌ముందే ఆ ప‌ల్లెల్లో వాలిపోయిన శాస‌న స‌భ్యులు మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ అక్క‌డే ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు ల‌బ్ధిదారుల‌కు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా 246 గ‌డ‌ప‌ల‌ను సంద‌ర్శించారు. ప్ర‌తి గ‌డ‌ప‌లోనూ భాగ్య‌ల‌క్ష్మి గారికి సాద‌ర స్వాగ‌తం ల‌భించింది. స్థానికులు శాస‌న స‌భ్యులు వారిని చూసి అంతా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఈ ప్రాంతాలో ఎమ్మెల్యే తిర‌గ‌డ‌మా? అంటూ ఆశ్చ‌ర్యానికి గురికావ‌డం ఆ గ్రామాల వారి వంతు అయింది. గిరిజ‌నులు సంక్షేమ‌మే ప్ర‌భుత్వం ల‌క్ష్యమ‌ని ఈ సంద‌ర్భంగా భాగ్య‌ల‌క్ష్మిగారు పేర్కొన్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా ప్ర‌గ‌తి ప‌థంలో న‌డిపించాల‌న్న‌దే గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గారి ల‌క్ష్య‌మ‌ని ఆమె పేర్కొన్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎంపీపీటీ పి. కృష్ణ‌మూర్తి, ఎంపీపీ బోయిన కుమారి, ఎంపీటీసీ నాగ‌మ‌ణి, సీనియ‌ర్ నాయ‌కులు మ‌త్స్య‌రాజు, వైస్ ఎమ్‌పిపిలు ఆనంద్‌, దేముడు, వైయ‌స్ ఆర్‌సీపీ మండ‌లాధ్య‌క్షులు ల‌క్ష్మ‌ణ్ వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, స‌ర్పంచ్‌లు, ఎంపీటీలు పాల్గొన్నారు.

Related Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,858FansLike
3,604FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

జనసేన బస్సుయాత్రను ఆపింది వాళ్లేనా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జనాల్లో ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఉద్దేశంతో అక్టోబర్లో బస్సుయాత్ర ప్రారంభించాలని నిర్ణయించి ఆయన స్వయంగా ప్రకటన చేశారు ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల బస్సు...

తోటగరువు జెడ్పీ హైస్కూల్లో సుభద్ర ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం వంటశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. అనంతరం...

వంజంగి అందాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పాడేరు మండలం వంజంగి కొండపై ప్రకృతి మలిచిన అందాల కు సంబంధించి ఈరోజు ఫోటోలు వంజంగిలో ప్రకృతి ప్రకృతి మలచిన దృశ్యం

ప్ర‌తి త‌లుపూ త‌డుతూ…స‌మ‌స్య‌లు వింటూ….

18వ వార్డు ఉత్స‌హాభ‌రితం సాగుతున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం 18వ వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ఉత్సాహ‌భ‌రితంగా సాగుతోంది. విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్...

ఇంటింటా సంక్షేమం

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌మ‌తి జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే ఇంటింటా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి...