
నిన్న పెదలబుడు ….నేడు అరకు మండల ప్రజా పరిషత్
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం
బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దంటూ నినాదాలు…
రోడ్డుపై నిరసనలు
సొంత పార్టీవారే వైసీపీ అధిష్టానానికి ఎదురుతిరుగుతున్నారు… తమకు పార్టీ కంటే జాతి మనుగడే ముఖ్యమని తేల్చి చెప్పేస్తున్నారు. రోడ్డెక్కి మరీ జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు.
నిన్న పెదలబుడు గ్రామ పంచాయతీ….ఈ వాళ అరకు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
వైయస్సార్‌సీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. తమ జాతి కోసం సొంత పార్టీనే ఎదురించాయి. జగన్ ప్రభుత్వం తీర్మానం సరికాదని దానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపాయి. జాతి మొనగడే తమకు ప్రథమ ప్రాధాన్యమని తర్వాతే పార్టీ అని తేల్చి చెప్పాయి… వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ 24వ తేదీన అసెంబ్లీలో బోయ వాల్మీకి వెళ్తూ వరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఆ తీర్మానం ఆమోదిస్తూ ప్రతిపాదనను కేంద్రానికి పంపింది దీనిపై ఆంధ్రప్రదేశ్ మన్యం ప్రాంతం మొత్తం అట్టుడుకుతోంది. తొలిసారిగా వైసీపీ ప్రభుత్వానికి అంటే సొంత పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాడగడ పంచాయతీ తీర్మానం చేసింది. ఇప్పుడు అరకు మండల ప్రజాపరిషత్తు సర్వసభ్య సమావేశం కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. అంతటితో ఆగకుండా వెంటనే ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ తీర్మానం చేసిన అనంతరం అరకు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీతో కలిపి నిరసన తెలిపారు. బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడం సరికాదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ అరకు ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దారుకు సంబంధిత వినత పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రంజిపల్లి ఉషారాణి, ఎంపిటిసి శెట్టి ఆనంద్ వైఎస్ఆర్సిపి నాయకులు బాలాజీ మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.


