
బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ తీర్మానించడంపై
టిడిపి తీవ్ర నిరసన
తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా
ఈ తీర్మానాన్ని వ్యతిరేకించని వారంతా గిరిజన ద్రోహులు

బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ అరకులోని తెలుగుదేశం పార్టీ శనివారం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర ఆధ్వర్యంలో అరకులోని భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అసెంబ్లీలో గిరిజనులకు నష్టం చేకూర్చేలా చేసిన తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ తహశీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దొన్నుదొర మాట్లాడుతూ గిరిజనులకు అన్యాయం జరిగేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమైన చర్యని అన్నారు. గిరిజన సంపదను దోచుకుపోవడం కోసం గిరిజనులను మైనార్టీలు చేసే ప్రయత్నం జగన్ చేస్తుందన్నారని విమర్శించారు. జగన్‌కు గిరిజన సంపదను దోచుకోవడానికి అనుకూలంగా చట్టాలు చేసేటప్పుడు కొండ మీద వారు అసలైన గిరిజనులను వ్యతిరేకిస్తారని…కింద బీసీలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ తీర్మానం చేశారని అన్నారు. సాధారణంలో ఏదైనా కమీషన్‌కు ఎక్కువ మంది ఏ అభిప్రాయం చెబితే దాన్నే అమలు చేస్తుందని …అలాంటప్పుడు 30లక్షలమంది ఉన్న ఎస్టీల కంటే, 40 లక్షల మంది ఉన్న బోయ వాల్మీకి, బెంతు ఒరియా వారి అభిప్రాయమే నెగ్గుతుందని ఈ ఏకసభ్య కమీషన్‌ను ఈ ప్రభుత్వం వేసిందని చెప్పారు.
మేజర్ కమ్యూనిటీని మైనార్టీ కమ్యూనిటీలో కలపడం ఎక్కడైనా చేశామా?

40 లక్షలకు పైగా ఉన్న బీసీ కమ్యూనిటీని చెందిన బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను కేవలం 28 లక్షల నుంచి 30 లక్షల వరకూ ఉన్న అసలైన ఎస్టీ జాబితాలో కలపడం చూస్తుంటే జగన్ రెడ్డి కావాలనే గిరిజనులకు అన్యాయం చేస్తున్నట్టు స్పష్టమవుతుందని పేర్కొన్నారు. ఎక్కడైనా తక్కువ మంది ఉన్న వారిని ఎక్కువ కులంలో కలపడం చూశాం కానీ… ఎక్కువ మంది ఉన్న కులాన్ని తక్కువ మంది ఉన్న కులంలో విలీనం చేయడం జగన్‌కే దక్కిందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే కొండ ప్రాంతంలో నివసించే గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
జగన్ గిరిజన ద్రోహి

గిరిజనులకు అన్యాయం జరిగేలా మైదాన ప్రాంతంలో ఉండే బీసీలను తీసుకొచ్చి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిజన ద్రోహి అని ఆయన ఆక్షేపించారు. పార్టీలకు అతీతంగా గిరిజనులకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ తమ గలాన్ని వినిపించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా ప్రతి ఒక్కరూ ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలని కోరారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తని ప్రజాప్రతినిధులు అందరూ గిరిజన ద్రోహులుగానే మిగిలిపోతారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ ఇన్చార్జి కిడారి శ్రావణ్ కుమార్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం, పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు, పార్లమెంట్ కోశాధికారి వంతల నాగేశ్వర రావు, ఇచ్ఛావతి,అమ్మన్న, చందు పాడి మాదాల సర్పంచ్ వంతల శ్రీను, మాజీ సర్పంచ్ మహదేవ్ , ప్రసాద్టి, టీడీపీ యూత్ లీడర్ కిల్లోచంద్రశేఖర్ కిల్లో నాగరాజు, పెదలబుడు వైస్ సర్పంచ్ చందునిర్మల, మాజీ వైస్ ఎంపిపి పొద్దు అమ్మన్న, మాడగడ ఎంపిటిసి కృష్ణ , పద్మ పురం ఎంపిటిసి సాయిరాం, మాజీ సర్పంచ్ మహాదేవ్,
మహిళ నాయకులు భూర్జా లక్ష్మీ, ద్రౌపతి, నూకరత్నం, ఇచ్చావతి, కళావతి,వార్డు మెంబర్ త్రినాథ్, నాగరాజు, దామోదర,రాము , నాయకులు విజయ్,రాము, నాగేష్, రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.