Thursday, September 21, 2023
Google search engine
Homeగిరిజనంజ‌గ‌న‌న్న పాల‌న‌లో ప్ర‌తిప‌క్షం, అధికార‌ప‌క్ష‌మూ రెండూ మేమే

జ‌గ‌న‌న్న పాల‌న‌లో ప్ర‌తిప‌క్షం, అధికార‌ప‌క్ష‌మూ రెండూ మేమే


మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్ కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యాం
జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్తు స‌క్సెస్ మీట్‌లో పాడేరు శాస‌న స‌భ్యులు శ్రీ‌మ‌తి కొట్టగుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి గారు

పీవీటీజీ గ్రామం….చింతపల్లి మండలం ఎర్ర బొబ్బల పంచాయతీ బోయలగూడెం గ్రామం ఇప్పటివరకు మండల స్థాయి అధికారి కూడా అక్కడికి వెళ్ళలేదు…. కానీ జ‌గ‌నన్నే మా భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మంలో ద్వారా మేం వెళ్ల‌గ‌లిగాం…. అక్క‌డ వారి స‌మ‌స్య‌లు తెలుసుకొని 200మీట‌ర్ల సీసీ రోడ్డు కూడా మంజూరు చేశాం అని తెలిపారు. జగనన్న తీసుకున్న సంకల్పానికి అనుకూలంగా మేమంతా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరోసారి స్థాపించేందుకు నిరంతరం శ్ర‌మిస్తున్నామ‌ని పేర్కొన్నారు.


జ‌గ‌న‌న్న పాల‌న‌లో అధికార ప‌క్ష‌మే ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను కూడా పోషించి పాలిస్తుంద‌ని ప్ర‌తి స‌మ‌స్య‌ను తామే నేరుగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి తెలుసుకొని మ‌రీ వాటిని ప‌రిష్క‌రిస్తున్నామ‌ని పాడేరు శాస‌స స‌భ్యులు శ్రీ‌మతి కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి గారు అన్నారు. మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్ కార్య‌క్ర‌మంతో ప్ర‌జా ప్ర‌తినిధులు, వైయ‌స్సార్సీపీ శ్రేణులు ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువయ్యే అవ‌కాశం ల‌భించింద‌ని పేర్కొన్నారు.
జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం నువ్వే జగన్ సక్సెస్ మీట్ ను పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారు తన క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. అరకు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి గొడ్డేటి మాధవి గారు, ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి జలపల్లి సుభద్ర గారు, ఆంధ్రప్రదేశ్ ట్రై కార్ చైర్మన్ సతక బుల్లిబాబు గారు, నియోజకవర్గ పరిశీలకులు శ్రీ చొక్కాకుల వెంకటరావు గారు, ఆంధ్రప్రదేశ్ పెట్రో కెమికల్ కారిడార్ చైర్మన్ చొక్కాకుల లక్ష్మీ గారు హాజరైన ఈ సమావేశంలో భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ…. రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు – మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం చాలా విజయవంతంగా నడుస్తూ ఉండడాన్ని మనమంతా చూస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గాని మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలపై గాని ప్రజల అభిప్రాయాలను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోగలుగుతున్నామని చెప్పారు. ఒకపక్క ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూనే మరోపక్క ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని కూడా వివరించే ప్రయత్నం చేసేందుకు ఈ కార్యక్రమం అద్భుతంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల మద్దతును వారి మనసులను చూరగొనే ప్రయత్నంలో వైఎస్సార్సీపి ఈ కార్యక్రమం ద్వారా విజయం సాధించిందని చెప్పాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల గృహ సారధులు 60 లక్షల మందిని కలవడం జరిగిందని ఇది నిజంగానే రికార్డ్ అని చెప్పారు. ప్రజల మద్దతు కోరుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల పొందుతున్న వారు 47 లక్షల మంది మిస్డ్ కాల్ ఇచ్చి జగనన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అన్నారు. రాష్ట్రంలో పట్నంలో ఉండే గల్లీ దగ్గర నుంచి మారుమూల పల్లె వరకు గిరిజన ప్రాంతాల్లో తండాల వరకూ గడప గడపలోనూ మా నమ్మకం నువ్వే జగన్ నినాదం వినిపించిందని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే అభిప్రాయాన్ని ప్రజలంతా వ్యక్తం చేశారని తెలిపారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉండాలని బలమైన నాయకుడు ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజలందరూ నమ్మారని తెలిపారు. ప్రజలు ఓట్లతో గెలుపొందిన ప్రతి ప్రజా ప్రతినిధి ప్రజలకు మాత్రమే జవాబుదారీ అనే సిద్ధాంతాన్ని అసెంబ్లీ హాళ్ళకో, సమావేశాలకో పరిమితం కాకుండా ప్రజల వద్దకే వెళ్లాలి ప్రజలతో అభిప్రాయం తెలుసుకోవాలి అప్పుడే దాని సాధికారత లభిస్తుందన్న విషయాన్ని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ప్రజా ప్రతినిధి వాళ్లకు ఓట్లేసిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలుసుకొని ప్రభుత్వ పాలన పైనా సంక్షేమ పథకాల పైనా అభిప్రాయాలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడిందని తెలిపారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల్లో 98.4% ఈరోజు విజయవంతంగా అమలు చేయగలిగాం కాబట్టే ప్రజాప్రతినిధులమైన తాము ప్రజల వద్దకు వెళ్లి మీకు ఏ మేరకు మేలు జరిగింది? ఇంకా ఎక్కడ అన్యాయం జరుగుతుంది? అనే విషయాన్ని స్పష్టంగా అడగగలుగుతున్నామని అన్నారు. ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందలేదు అని గాని, అభివృద్ధి కుంటిపడిందని గాని ప్రతిపక్షాలు ప్రశ్నలు గాని సందేహాలు గానే లేవనెత్తిన అవకాశం లేని విధంగా ఈరోజు పాలన సాగుతుందని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారలోకి వచ్చిన తర్వాత మేమే అధికార పక్షం…. మేమే ప్రతిపక్షంగా పాలన కొనసాగిస్తున్నామని సమస్యల మేమే నేరుగా తెలుసుకుంటున్నామని అవకాశాన్ని ప్రతిపక్షాన్ని కూడా ఇవ్వడం లేదని సమస్యలు అనేవి జీరో గా చేయడమే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ఎవరికైనా అర్హత ఉండి కూడా ప్రభుత్వ పథకాల అందని వారిని మేము స్వయంగా వెళ్లి అడిగి తెలుసుకుని వారు వారికి ఆ పథకాలను వర్తింప చేస్తున్నామని అన్నారు. ఆ పనులన్నీ చేస్తున్నప్పుడు ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని నిందించే అవకాశం లేకుండా పోయిందని భాగ్యలక్ష్మి గారు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular