
జగనన్నే మా భవిష్యత్తు…మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి శాసన సభ్యులు శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారు శుక్రవారం శ్రీకారం చుట్టారు. పాడేరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలైన ఆంధ్రప్రదేశ్ ట్రైకార్ చైర్మన్ శ్రీ సతక బుల్లిబాబు, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి గారు, ఇతర నాయకులతో కలసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం మా నమ్మకం నువ్వే జగన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి గారు మీడియాతో మాట్లాడారు. ఆమె మాటల్లో…. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జగనన్న మా భవిష్యత్తు … మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జరగబోయే గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నాం… మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజా ప్రతినిధులు ప్రజలకే జవాబుదారీగా ఉండాలని, నిరంతరం ప్రజల్లోనే ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ రూపొందించడం జరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత ఏడాది మే నెల నుంచి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకూ ప్రతి సచివాలయానికి వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి మేలును వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ప్రజలకు చేరుతున్నాయి? వాటిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? తదితర ప్రజా సమస్యలను తెలుసుకొనెందుకు ఆ కార్యక్రమం రూపొందించారు. అది విజయవంతంగా ఒక పక్క జరుగుతుంది. దీంతో పాటు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వైయస్సార్‌సీపీ శ్రేణులు కూడా బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి సచివాలయంలోనూ ముగ్గురు కన్వీనర్లను, ప్రతి వాలంటీర్ పరిధిలో ముగ్గురు గృహసారథులను నియమించడం జరిగింది. అందులో ఒకరిని వాలంటీర్ కుటుంబ సభ్యులను నియమించాలని పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈ వ్యవస్థ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళుతుంది అని భాగ్యలక్ష్మి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ ఎస్టీ సెల్ జోన్ అధ్యక్షులు కిమిడు విశ్వ, వ్యవసాయ సలహామండలి చైర్మన్ సరస్వతి, ఎస్వీ రమణ, మండల అధ్యక్షులు రాంబాబు, ఎంపీటీసీలు లకే రామకృష్ణ పాత్రుడు, కన్వీనర్ కోటి, రాజేశ్వరి, సర్పంచ్‌లు రాంబాబు, లక్ష్మణ్ దొర, మంగ్లన్న దొర, కన్నా పాత్రుడు, అల్లాడ నగేష్ తదితరులు పాల్గొన్నారు.