
- పోరాట యోధుడు గాం గంటం దొర శత వర్థంతి వేడుకల్లో పాడేరు శాసన సభ్యులు శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారు
- గాం గంటం దొర కాంస్య విగ్రహావిష్కరణ, ఘనంగా నివాళులర్పించిన ఎంపీ మాధవి, ఐటీడీఏ పీవో అభిషేక్, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు
గాం గంటం దొర, గాం మల్లు దొర, బోనంగి పండు పడాల్, తగ్గి వీరయ్య దొర ఇలా అనేకమంది గిరిజనులు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగమైనందుకు ఓ గిరిజన శాసన సభ్యురాలుగా ఎంతో గర్వంగా ఉందని పాడేరు శాసన సభ్యులు శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారు అన్నారు. కొయ్యూరు మండలం బట్ట పనుకుల పంచాయతీ లంక వీధి గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటం దొర గారి శత వర్థంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గాం గంటం దొర కాంస్య విగ్రహాన్ని ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి గారు, ఐటీడీఏ పీవో శ్రీ అభిషేక్ గారు, పాడేరు శాసన సభ్యులు శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారు ఆవిష్కరించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాడేరు ఐటిడిఏ, క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గంటం దొర కుటుంబ సభ్యులకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి వారికి గృహ నిర్మాణాల పూర్తి చేసి గృహప్రవేశాలు జరగాలని ఈ సభలోనే నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన గాం గంటం దొర కుటుంబ సభ్యులు నిలువు నీడ లేకుండా ఉన్న పరిస్థితులు దగ్గర నుంచి అన్నింటి అధ్యయనం చేసి ఈరోజు వారందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేసి గృహ నిర్మాణానికి పూనుకున్న ఎన్ సీసీ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది ఇదే తేదీ నాటికి ఆ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలు కూడా జరగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆశాభావం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు ఒక క్షత్రియ వర్గానికి చెందినా సరే గిరిజనుల సమస్యలపై పోరాటం చేసి స్వతంత్ర ఉద్యమంలో మల్లు దొర, గంటం దొర, పండు పడాల్ వంటి స్థానిక నాయకులకు శిక్షణ ఇచ్చి బ్రిటిష్ వారు నుంచి విముక్తి కోసం పోరాడేలా తీర్చిదిద్ది స్వాతంత్య్రోద్యమంలో కీలక భాగస్వామ్యం చేశారన్నారు. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మన ఆదివాసి యోధులు చేసిన పోరాటాన్ని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వారి ఆశయాలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత నేటి యువతలో ఉందనిభాగ్యలక్ష్మి గారు అన్నారు.

గిరిజన మహిళకు అత్యంత గౌరవం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు
స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో స్వతంత్ర ఉద్యమకారులను గుర్తు చేసుకోవాలని పిలుపు మేరకు ఈరోజు ఈ వేడుక నిర్వహించుకోవడానికి కారణమైందని ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి గారు తెలిపారు. అంతేకాకుండా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారికి భారతదేశ అత్యున్నతమైన ప్రథమ పౌరురాలు పదవిని అలంకరించినందుకు ఒక గిరిజన శాసనసభ్యులుగా ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఎంతోమంది వ్యక్తులు ముఖ్యమంత్రులుగా, ప్రధాన మంత్రులుగా బాధ్యతలు చేపట్టినా, గిరిజనులకు అంతటి అత్యున్నత పదవి బాధ్యతలు అప్పగించి ఆ గౌరవాన్ని అందించిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న గిరిజన యోధులందరినీ గుర్తించి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం అనేది నిజంగా శుభ పరిణామన్నారు. గాం గంటం దొర కుటుంబ సభ్యులకు ఇల్లు నిర్మాణంలో తమ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గంటన్నర కుటుంబ సభ్యుల్లో నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు చూపించే ఆలోచన కూడా చేస్తున్నట్లు ఈ విషయంపై ఇదివరకే ఐటిడిఏ పీవో అభిషేక్ గారితో చర్చించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పీటీసీ వారా నూకరాజు, పీఎసీఎస్ చైర్మన్ సూరిబాబు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు నాని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు శోభా సోమేశ్వరి, షేక్ మీరా, బీసీ డైరెక్టర్ గాడి నాగమణి, బుజ్జి, సినియర్ నాయకులు గాడి సత్తిబాబు, మహేష్, అప్పారావు, కొమ్ముక శేఖర్, ముసలినాయుడు, ఎంపీటీసీ గాంధీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వైయస్ ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
