
ఆయన ముని మనవడి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడిన సోమేశ్వరి గారు
స్వతంత్య్ర సమరయోధులు, ఆదివాసీ గిరిజన యోధుడు, అల్లూరి సీతారామరాజు గారి సేనానిగా పేరుపొందిన గాం గంటందొర గారి శత వర్థంతి వేడుకలు కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీ లంక వీధి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ శోభా సోమేశ్వరి గారు గాం గంటం దొర గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గంటం దొర గారి మునిమనవుడు గాం బుడ్డి దొర గారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణదేవి పేటలో ఉన్న గాం గంటం దొర గారి దేహదహన పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి నివాళులర్పించారు.




