పాడేరు ఐటిడిఎ పరిధిలో పనిచేసే క్లాప్ మిత్రాలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని టిటిడి చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త, గౌరవ పెద్దలు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి శోభా సోమేశ్వరి గారు కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి క్లాప్ మిత్రాల సమస్యలపై వివరించారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలో పాడేరు, అరకు నియోజకవర్గాల్లో 11 మండలాల్లో పనిచేస్తున్న క్లాప్ మిత్రాలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి వినతిపత్రాన్ని ఆయనకు సమర్పించారు. 10 నెలలుగా క్లాప్ మిత్రాలకు జీతాలు అందక వారు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఐటిడిఏ పరిధిలో ఉన్న పంచాయతీలకు ఆదాయ మార్గాల లేక వారికి జీతాలు చెల్లించే పరిస్థితులు పంచాయతీలకు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సుబ్బారెడ్డి గారికి వివరించారు. పంచాయతీలకు కేటాయించిన 14వ ఆర్థిక సంఘం నిధులను నుంచి వారికి జీతాలు చెల్లించాలని ప్రభుత్వం తెలియజేసినా ఆ నిధులు కూడా వారి అవసరాలకే చాలకపోవడంతో క్లాప్ మిత్రాలకు పంచాయతీలు జీతాలు చెల్లించాలని పరిస్థితులను ఎదుర్కొంటున్నాయన్నారు. మైదాన ప్రాంతాల్లో మాదిరి ఐటిడిఎలో పరిధిలో ఉండే పంచాయతీలకు ఆదాయాలు వచ్చే మార్గాలు లేవని వివరించారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పొందే ఆర్థిక సాయంతో మాత్రమే వారి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. పది నెలలుగా జీతాలు అందక వారి కుటుంబాలు ఇబ్బందులతో నెట్టుకొస్తున్నారని తెలిపారు. అందుకే క్లాప్ మిత్రాలకు పంచాయతీలు కాకుండా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి గారిని కోరారు. వీరికి పంచాయతీలు బకాయిలపడ్డ జీతాలను కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచే చెల్లించేలా చూడాలని ఆమె విన్నవించారు.
సీఎంతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సుబ్బారెడ్డి గారు
క్లాప్ మిత్రాలకు జీతాలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో తానే స్వయంగా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని పెద్దలు, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారు స్వయంగా చెప్పారని ఈ సందర్భంగా సోమేశ్వరి గారు పేర్కొన్నారు. గురువారం సుబ్బారెడ్డి గారు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవనున్న విషయాన్ని తమతో పంచుకుంటూ మన పరిసరాలను శుభ్రపరిచే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారని సోమేశ్వరి గారు తెలిపారు.

