Thursday, September 21, 2023
Google search engine
Homeగిరిజనంఅరకు పార్లమెంట్ లో తెలుగుదేశం జెండా ఎగరేద్దాం

అరకు పార్లమెంట్ లో తెలుగుదేశం జెండా ఎగరేద్దాం

  • గిరిజ‌నుల‌కు కూడు, గూడు, గుడ్డు అందించింది ఎన్టీఆరే
  • మినీ మహానాడులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
  • అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేద్దామని ఇక్కడ‌ గెలుపును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి బహుమతిగా ఇద్దామని మాజీ శాసనసభ్యులు పాడేరు ఇంచార్జ్ శ్రీమతి గిడ్డి ఈశ్వరి గారు అన్నారు. సాలూరులో జరిగిన మినీ మహానాడు లో పాల్గొని ఆమె మాట్లాడారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని వాళ్లంతా అవగాహన లేక ప్రచారం చేసుకుంటున్నారని ఆ పార్టీ ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోతుందని ఆమె చెప్పారు. గిరిజనుల ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఆదివాసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదివాసీలకు ఇప్పటివరకు అమలైన 27 సంక్షేమ పథకాలను రద్దు చేయడమే కాకుండా మార్చి నెలలో అసెంబ్లీలో బోయ వాల్మీకి బెంతు ఒరియాల‌ను ఎస్టీ జాబితాలో కలుపుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానంతో ఆదివాసుల ఉనికినే ప్రమాదంలో నెట్టేశారని తెలిపారు. ఒకపక్క గిరిజన పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందని మరోపక్క ఆ జాతి ఉనికినే దెబ్బతీసే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగిస్తుందని ఆమె దుయ్య‌బ‌ట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సీపీకి ఓటు వేయకూడదని దృఢ‌ నిశ్చయంతో గిరిజనలంతా ఉన్నారని తెలుగుదేశం పార్టీ గాలి బలంగా వీస్తోందని గిరిజనలంతా తెలుగుదేశమే తమకు న్యాయం చేయగల‌దని బలంగా నమ్ముతున్నారని గిడ్డి ఈశ్వరి గారు తెలిపారు. గిరిజనులంతా ఏకమొత్తంలో వైఎస్ఆర్ సీపీకి పట్టం కడితే కనీసం వారి అభిప్రాయం కూడా అడగకుండా వారి ప్రజాప్రతినిధులు కూడా తెలియజేయకుండా బోయ వాల్మీకులను ఎస్టీలు జాబితాలో కలుపుతూ తీర్మానం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య అని ఆమె పేర్కొన్నారు. గిరిజనుల‌ హక్కులను, చట్టాలను తుంగలో తొక్కుతూ వారి నష్టానికి కారకులైన వైఎస్ఆర్సిపి ఓడించాలని ప్రజలంతా కంకణం కట్టుకున్నార‌న్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారికి గిరిజలంతా ఓట్లు వేయిపోయిన సరే వారి సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో సాలూరులో మినీ మహానాడు జరగడమే రేపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకు సంకేతమని తెలిపారు. ఈనెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో ఇంతకు ముందు ఎన్న‌డూ కనివిని ఎరుగని రీతిలో మహానాడు జరగబోతుందని దాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని తెలిపారు. ఉగాది, సంక్రాంతికి మన తెలుగు ప్రజలు ఎంత సంతోషంగా జరుపుకుంటారో అదే మాదిరిగా మే 28వ తేదీన అత్యంత ప్రీతిపాత్రం మన తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు జరుపుకుంటామని అన్నారు. ఈ ఏడాది అన్న‌గారి శత జయంతి ఉత్సవాలను మహానాడు పేరిట అత్యంత వైభవంగా జరిపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు రాజమహేంద్రవరంలో చకచకా జరుగుతున్నాయని తెలిపారు.

గిరిజనులకు కూడు, గూడు, గుడ్డ అందించినది ఎన్టీఆర్


ఆదివాసి బిడ్డలకు కూడు, గూడు, గుడ్డ అందించినది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గార‌ని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి గారు అన్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన ప్రారంభ రోజులను పాడేరు లోని అడారిమెట్ట గ్రామం వచ్చి తొలిసారిగా గిరిజన పేదలకు పక్కా గృహాలను నిర్మాణానికి కృషి చేసినటువంటి మహనీయులు ఎన్టీఆర్ అని తెలిపారు. ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం అందించడం వలన గిరిజనులకు ఎప్పుడు జరిగినటువంటి లబ్ధి చేకూరిందని వారు ఆకలి తీర్చినటువంటి వ్యక్తిగా ఎన్టీఆర్ మిగిలిపోయారని చెప్పారు. ఆరోజు పేదవారికి పెన్షన్ ఇవ్వాలని ఆలోచన ఎన్టీఆర్ నుంచే ప్రారంభమైందని పేర్కొన్నారు. తొలిసారిగా గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఎన్టీఆర్ గారేన‌ని గుర్తు చేశారు. ఆ రోజుల్లో 10వ తరగతి పాస్ అయినా, ఫెయిల్ అయినా స‌రే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆదివాసి బిడ్డలకు అందించింది తొలిసారిగా ఎన్టీఆర్ అని చెప్పారు. ఆ తర్వాత గిరిజనుల ఉద్యోగులన్ని గిరిజనులకే దక్కాలని నారా చంద్రబాబునాయుడు గారు జీవో నెంబర్ 3ను తీసుకొచ్చారని ఈశ్వరి గారు చెప్పారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 3 విషయాల్లో కూడా విడ్డూరంగా వ్యవహరిస్తుందని హైకోర్టు దానిని కొట్టేస్తే సుప్రీంకోర్టులో ఇప్పటివరకు రివ్యూ పిటిషన్ కూడా వేయకపోవడంతో దుర్మార్గ‌మైన‌ చర్యని అందుకే గిరిజనులు అంతా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular