
- వైయస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవంలో పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గారు
అన్నదాత బాగుండాలని, రైతులకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని ఇదివరకు వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా వ్యవసాయాన్ని పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదని పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గారు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్లో వైయస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఏ పిఓ అభిషేక్ గారితో కలిసి రైతులకు యంత్ర పరికరాలు, ట్రాక్టర్లను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ పంట నష్టపోయినప్పుడు అన్నదాతలు ఆదుకున్నది, రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం ఇలా అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి మాత్రమేనని ఆమె పునరుద్ఘాటించారు.
వ్యవసాయానికి ఉపయోగపడే యంత్ర పరికరాలు గిరిజనులకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తుందని తెలిపారు. వ్యవసాయ కూలి పెరుగుతున్న నేపథ్యంలో సాంప్రదాయ సాగుతో పాటు యాత్రీకరణతో కూడిన సాగు కూడా చాలా అవసరమని తెలిపారు. 40% సబ్సిడీ, 50% రుణం రూపంలోనూ ప్రభుత్వం అందజేస్తుందని 10% మాత్రమే గిరిజన రైతులు చెల్లించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గారు తెలిపారు. మొదటి దశలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు 29 ట్రాక్టర్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఇప్పుడైతే 32 ట్రాక్టర్లు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఓ మంచి ఆలోచన చేసిందని రైతులంతా ఐక్యతగా ఉండి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలు జరుగుతుందని చెప్పారు. రుణాలను తిరిగి చెల్లిస్తేనే మరికొంతమంది రైతులకు బ్యాంకర్లు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అందువల్ల తీసుకున్న రుణాలు చెల్లించే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని చెప్పారు. ఈ పథకం సద్వినియోగం చేసుకునేలాగా సచివాలయాల పరిధిలో ఉన్న వ్యవసాయ, ఉద్యానవన అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొట్టగుళ్లి ఉషారాణి, డిసిసిబి సీఈఓ వర్మ, వ్యవసాయ సలహా మండలి సరస్వతి, జీకే వీధి జెడ్పిటిసి శివరత్నం, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు సీదరి రాంబాబు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సరస్వతి, కన్నా పాత్రుడు, బసవన్నదొర, బాబురావు పాస్టర్ తదితరులు పాల్గొన్నారు.


