
అనకాపల్లి మండలం మాకవరం అంగన్వాడి కేంద్రాన్ని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు గారు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఆయన తనిఖీలు నిర్వహించే సమయానికి టీచర్ గానీ, పిల్లలు గానీ లేకపోవడాన్ని గమనించారు. సుమారు 30 నిమిషాలు పాటు నిరీక్షించిన అనంతరం రికార్డులను పరిశీలించారు. వాస్తవ పరిస్థితులకు రికార్డుల్లో చూపిన దానికి పొంతన ఉండకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరు దగ్గర నుంచి పిల్లలకు అందించే పౌష్టికాహారం వరకూ అన్నింటిలోనూ లోపాలు కనిపించడంతో తీరు విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టి అంగన్వాడీ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యనారాయణ గోవింద్, కృష్ణ ,కరణం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
