జగనన్న గోరుముద్దలో మరో పౌష్టికాహారం రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని సీతానగరంలో హైస్కూల్‌లో ప్రారంభించిన అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు
మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి కారణమైన అనేక పోషకాలు సమ్మిళితమే రాగి జావని అనకాపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు అన్నారు. జగనన్న గోరుముద్దులో భాగంగా మరో పౌష్టికాహారమైన రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం అనకాపల్లి మండలం సీతానగరం ఉన్నత పాఠశాలలో ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండడానికి ప్రధానమైన రహస్యం రాగిజావేనని చెప్పారు. ఈరోజు ఎముకలు బలహీన పడిపోతున్నాయన్న.. రక్తహీనత సమస్య ఉందన్నా… కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నా… వారంతా కూడా పౌష్టికాహార లోపం కారణంగానే ఆ సమస్యను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మన పూర్వీకులకు రాని అనారోగ్య సమస్యలు మనం ఎదుర్కోవడానికి కారణం పాశ్చాత్య సంస్కృతి ప్రభావంగా ఏర్పడ్డ ఆహార అలవాట్లేనని ఆయన పేర్కొన్నారు. భారత దేశ సాంప్రదాయం పద్ధతుల ప్రకారం మన ఆహారపు అలవాట్లు కొనసాగించి ఉంటే ప్రజలంతా ఆరోగ్యంగా ఉండే వారిని అన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పౌష్టికాహార విలువలతో కూడినటువంటి రాగిజావను విద్యార్థి దశ నుంచే అందజేస్తే అనారోగ్య సమస్యలను తరిమికొట్టే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ఏ విద్యార్థి పౌష్టికాహార లోపంతో బాధపడిన సందర్భాలు భవిష్యత్తులో ఎదురు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
కార్పొరేట్ బడులకు దీటుగా సర్కార్ పాఠశాలలు
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులని తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తనకు రెండేళ్ల అవకాశం ఇస్తే ప్రభుత్వ బడుల రూపురేఖలు పూర్తిగా మార్చివేస్తామని కార్పొరేట్ పాఠశాలలకు తలదన్నేలా అత్యుత్తమ విద్యా విలువలు పెంపొందించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి గారు చెప్పడం అభినందనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ప్రపంచం మొత్తం హర్షిస్తోందని, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తే కచ్చితంగా చేసి తీరుతారని చెప్పారు. ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎవరో ఒకరి సిఫార్సు ఉంటే తప్ప ప్రభుత్వ బడుల్లో సీటు దొరికిన పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించాలని తపన నిరంతరం ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మరియు భారీ పరిశ్రమల శాఖ మాత్యులు గౌరవనీయులు గుడివాడ అమర్నాథ్ తపిస్తున్నారని అన్నారు. నిరంతరం నియోజకవర్గ పాఠశాల పాయని దృష్టి ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.