
అనకాపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబును ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వైయస్సార్సీపీ పంచాయతీ రాజ్ వింగ్ అధ్యక్షులు మేకల హనుమంతు బుధవారం ఘనంగా సన్మానించారు. జిల్లా ఎంపీపీలు అంతా అనకాపల్లిలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ముందుగా గొర్లి సూరిబాబును సత్కరించారు. అనంతరం మేకల హనుమంతును, వైయస్సార్సీపీ పంచాయతీరాజ్ వింగ్ రీజనల్ కోఆర్డినేటర్ అయిన యలమంచిలి ఎంపీపీ బొద్దపు గోవింద్‌ను సూరిబాబు దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు మాట్లాడుతూ గతం కంటే నేడు పంచాయతీ రాజ్ వ్యవస్థలో సమూల మార్పులు వచ్చాయని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో పాలనలో వినూత్న మార్పులు తీసుకొచ్చారని, ఆ గుర్తింపు జగన్‌మోహన్ రెడ్డి కే దక్కుతుందని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారానే అర్హతనే ప్రామాణికంగా చేసుకొని ఉత్తమ పాలన అందించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. జగన్‌మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసి ఇప్పటికంటే మరింత ఉత్తమ పాలను అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


