Thursday, September 21, 2023
Google search engine
Homeఅన‌కాప‌ల్లిఎంపీపీ గొర్లి సూరిబాబు గారి చొరవతో అనకాపల్లి అంగన్వాడీలకు మహర్దశ

ఎంపీపీ గొర్లి సూరిబాబు గారి చొరవతో అనకాపల్లి అంగన్వాడీలకు మహర్దశ

  • డిజిటల్ విద్యా విధానానికి శ్రీకారం
  • మండల పరిషత్ నిధులతో మారిన అంగన్వాడీల రూపురేఖలు
  • ప్రతి అంగన్వాడికీ 32 ఇంచెల ఎల్ఈడి టీవీలు
  • డిజిటల్ ఆంగ్ల విద్యా బోధనకు సంబంధించిన స్టడీ మెటీరియల్ అందజేత
  • స్టేడియో మీటర్లు,, చిన్నారుల తూనిక యంత్రాలు, సాల్టర్ స్కేల్స్ అదనం
  • రూ.1.10 కోట్లతో నూతన భవనాల నిర్మాణం, పాత భవనాలకు మరమ్మతులు
  • రూ.2.57 లక్షల అంగన్వాడీల విద్యుత్ బకాయిలను చెల్లించిన ఎంపీపీ గొర్లి సూరిబాబు


విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే దాని ఫలితాలు అత్యద్భుతంగా ఉంటాయని డాక్టర్ అబ్దుల్ కలామ్ గారు చెప్పిన మాటలు అనకాపల్లిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి… విద్యావంతుడైన అనకాపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారు నిరంతరం విద్యావ్యవస్థలో మార్పుల కోసం తపించే వ్యక్తి… పేదల బిడ్డలందరికీ నాణ్యమైన విద్య అందించాలని నిరంతరం తపన పడే నాయకుడు… అందుకే ఆయన నిత్యం పాఠశాలలు, అంగన్వాడీల సందర్శనలోనే ఉంటూ ఉంటారు…
విద్య ఒక్కటే జీవితంలో మార్పులు తీసుకురాగలదని మన ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు పెట్టుబడులు పరిశ్రమల శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు నిరంతరం చెప్పే మాటలకు అనుగుణంగా ఆయన పనిచేస్తూ ఉంటారు. మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి నేటి వరకు నిరంతరం అంగన్వాడీలను, స్కూళ్లను సందర్శిస్తూనే అక్కడ సమస్యల పరిష్కరించే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా నాడు – నేడు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా విద్యార్థులు కావలసినటువంటి స్కూల్ బ్యాగులు, బుక్స్ మధ్యాహ్నం భోజనంలో నాణ్యత పెంచడం వంటివన్నీ చేస్తూనే పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యమించింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గౌరవ శ్రీ గొర్లి సూరిబాబు గారు ప్రాథమిక దశలో ఉన్న అంగన్వాడీల రూపురేఖలు మార్చాలి ….అక్కడ కూడా డిజిటల్ విద్యా విధానాన్ని తీసుకురావాలి అని ఆయన నిరంతరం కలలకంటూ ఉండేవారు… ఆ స్వప్నం ఈరోజు నెరవేరింది.

అనకాపల్లి మండల ప్రజా పరిషత్తు నిధుల నుంచి మండలంలో ఉన్న 84 అంగన్వాడీ కేంద్రాలకు 32 ఇంచెల ఎల్ఈడి టీవీలను గౌరవ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదుగా శుక్రవారం అందించారు. వీటి కోసం 27 లక్షల రూపాయలను మండల ప్రజా పరిషత్ ఖర్చు చేసింది. దీంతో పాటు డిజిటల్ విద్యా విధానాన్ని ప్రోత్సహించాలని పెన్ డ్రైవ్ లో స్టడీ మెటీరియల్ మండల ప్రజా పరిషత్ అందజేసింది . ఇవి కాకుండా స్టేడియో మీటర్లు, చిన్నారుల బరువును తూచే యంత్రాలు, సాల్టర్ స్కేల్స్ అదనంగా అంగన్వాడీలకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు గారు సమకూర్చారు. ఆయన అంగన్వాడీలను సందర్శించినప్పుడు కొన్ని మరమ్మతులు చేయాల్సిన ఉన్నవి… మరికొన్ని అద్దె భవనాలు నడుస్తున్న ఉన్నవి వాటిని పరిశీలించిన అనంతరం పూర్తిగా దీంట్లోనే మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో మండల ప్రజా పరిషత్ నిధుల నుంచే కోటి 10 లక్షల కేటాయించారు. ఇందులో 40 అంగన్వాడీలకు మరమ్మతులు చేయడం కొన్నింటిని నూతన భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. దీంతో పాటు అంగన్వాడీలు విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. రూ.2,57,000 విద్యుత్ బకాయిలు పడ్డాయి. వీటిని కూడా మండల ప్రజా పరిషత్ నిధుల నుంచే ఆ బకాయిలను చెల్లించి అంగన్వాడీలకు మహర్దశ తీసుకొచ్చారు ఎంపీపీ సూరిబాబు గారు .

త్వరలో యూనిఫార్మ్స్, షూస్ అందజేతకు సన్నాహాలు
అనకాపల్లి మండలంలో ఉన్న 84 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న 700 మంది చిన్నారులకు త్వరలో యూనిఫామ్స్, షూస్ అందజేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీ గొర్లి సూరిబాబు గారు శుక్రవారం వెల్లడించారు. ఇవి కూడా పంపిణీ జరిగితే ఇక అంగనవాడిల్లో సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు అవుతుంది.
విద్యా అభివృద్ధి కోసం ఈయన తీసుకున్న నిర్ణయాలకు ప్రశంసలు లభిస్తున్నాయి. అందుకే నాయకులు విద్యావంతలైతే వారి ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉంటాయి…. భవిష్యత్ తరాలు తలరాతలు మార్చే ఆలోచనలు చేస్తారని చెప్పేందుకు ఇవే సాక్ష్యం అని పలువురు పేర్కొంటున్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular