
అఖిల్ సేవ – చింతపల్లి
విశాఖ ఏజెన్సీలో రైతు దినోత్సవాన్ని ఊరూరా ఘనంగా నిర్వహించారు. వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలను జరిపారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగల భాగ్యలక్ష్మి చింతపల్లిలో నిర్వహించినటువంటి రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్థానిక పాతబస్టాండ్ వద్ద వైఎస్ విగ్రహాన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు.
చింతపల్లి మండలం అన్నవరం గ్రామం లో స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు సుండ్రు చిన్నబ్బాయి మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గిరిజన సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని, ఆయన కృషి ఫలితం వల్లే ఈరోజు గిరిజనులు ఈ స్థాయిలో ఉండగలిగారన్నారు. నేడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా గిరిజన సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని చిన్నబ్బాయి అన్నారు.

ఎమ్ పి టి సి కృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాలను పూర్తి చేసే వ్యక్తి జగన్మోహన్రెడ్డి మాత్రమేనని, రాజశేఖర్రెడ్డి ఆలోచనలు ఎలా ఉంటాయో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కూడా అదే విధంగా ఉన్నాయన్నారు. నిరంతరం రైతుల కోసం ఆలోచిస్తారని దానిలో భాగంగానే రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారని ఇప్పుడు రైతుల కోసం ప్రత్యేకంగా రైతు దినోత్సవం నిర్వహించడం అభినందనీయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కిలో ఆనంద్ శోభ కృష్ణ సన్యాసిరావు బలరాం కామరాజు గ్రామ వాలంటీర్లు వి చంటి, శివ, సింహాచలం, నాడేల శివ, అగ్రికల్చర్ అసిస్టెంట్ నాగ శంకర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రశాంత్ రాజ్, వెటర్నరీ అసిస్టెంట్ గణపతి, భూ సర్వేయర్ కైలాస్ తదితరులు పాల్గొన్నారు.

అత్యంత తక్కువ సమయంలో వేగంగా అందించిన వార్త
Very nice and fast media
రైతు దినోత్సవం నిర్వహించడం ఏజెన్సీలో చాలా అభినందనీయం