ఆదివాసీకి అంద‌లం

Spread the love

జెడ్పీ చైర‌ప‌ర్స‌న్ సుభ‌ద్ర‌కు అభినంద‌న‌లు
ఆమెను జిల్లా ప‌రిష‌త్ పీఠంపై కూర్చొబెట్టే క్ర‌మంలో విజ‌యం సాధించిన అర‌కు ఎమ్మెల్యే ఫాల్గుణ‌

ఆదివాసీ తెగ అంటే ఎక్క‌డో కొండ కోన‌ల్లో జ‌నావాసాల‌కు దూరంగా ఉండే వారు. అడ‌విలో కొంత భూమిని చ‌దును చేసుకొని వ్య‌వ‌సాయం చేసి దానిపై వ‌చ్చే ఫ‌ల‌సాయం ఆధారంగా జీవ‌నం సాగించే తెగ ఇది. వీరినే పోడు వ్య‌వ‌సాయం అంటాం. అంటే అడ‌విలో కొంత భూమిని చెట్లు, పిచ్చి మొక్క‌లు తీసేసి ఆ భూమిని చ‌దును చేసుకొని సాగు చేస్తుంటారు. వారికి అందుబాటులో ఉన్న రాగులు, మొక్కజొన్న‌, మినుములు వంటి పంట‌ల‌ను పండించుకుంటూ జీవ‌నం సాగిస్తుంటారు. కొంత‌కాలం ఆ భూమిని సాగుచేసుకొని అక్క‌డ ఆ భూమిలో సారం అయిపోయింద‌ని భావించి మ‌రో ప్రాంతానికి వెళ్లి అక్క‌డ వ్య‌వ‌సాయం చేసుకొనే తెగే ఆదివాసీ తెగ‌. వీరినే Primitive Vulnerable Tribal Groups (పీవీటీజీ)లు అంటారు. ఈ తెగ‌కు చెందిన వ్య‌క్తే నేడు విశాఖ జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ గా బాధ్య‌త‌లు చేపట్టిన అరిబోరి సుభ‌ద్ర‌.

ఎవ‌రీ సుభ‌ద్ర‌


ముంచంగిపుట్టు మండలం నుంచి వైసీపీ త‌ర‌ఫున జెడ్పీటీసీగా విజ‌యం సాధించిన మ‌హిళ అరిబోరి సుభ‌ద్ర‌. రెండేళ్లు క్రిత‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అన‌తి కాలంలో అతి పెద్ద ప‌ద‌విని ద‌క్కించున్నారు. వైసీపీ ముంచంగిపుట్టు నుంచి జెడ్పీటీసీగా ఎవ‌రిని నిల‌పాలా అని అభ్య‌ర్థి కోసం తీవ్రంగా అన్వేషించింది. మొద‌ట ఆపార్టీ ముంచంగిపుట్టు మండ‌ల అధ్య‌క్షులు అరిసెల చిట్టిబాబు భార్య సీత‌మ్మ‌ను జెడ్పీటీసీ అభ్య‌ర్థిగా నిల‌పాల‌ని అర‌కు శాస‌న సభ్యులు చెట్టి ఫాల్గుణ‌ భావించారు. కానీ దానికి చిట్టిబాబు అంగీక‌రించ లేదు. త‌న‌కు మండ‌ల ప‌రిష‌త్ చైర‌ప‌ర్స‌న్ ప‌ద‌వి కావాల‌ని కోర‌డంతో ఆయ‌న భార్య సీత‌మ్మ‌కు ఎంపీటీసీ అభ్య‌ర్థిగా బ‌రిలో దించారు. ఆ స‌మ‌యంలో అరిబోరి సుభ‌ద్ర పేరు తెర‌పైకి వ‌చ్చింది. అనుకోకుండా పాల్గుణ ఎలాంటి అభ్య‌ర్థి కోసం అన్వేషిస్తున్నారో అటువంటి ల‌క్ష‌ణాల‌న్నీ సుభ‌ద్ర‌లో క‌నిపించాయి. మండ‌లంలో ప్ర‌తి ఒక్క‌రితో క‌లుపుగోరు ఉండే వ్య‌క్తి, నిత్యం అందుబాటులో ఉంటూ ప్ర‌జాసేవ‌కే అంకితమ‌య్యే వారి కోసమే పాల్గుణ ఆలోచించేవారు. ఆ నేప‌థ్యంలో ఈమెను సూచించారు. అభ్య‌ర్థి తాను అని తెలిసిన ద‌గ్గ‌ర నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ చుర‌గ్గా పాల్గొనే వారు సుభ‌ద్ర‌. నిత్యం బ‌రిలో ఉన్న ఎంపీటీసీ అభ్య‌ర్థుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతూ ఉండేవారు. ఏ అభ్య‌ర్థికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఆమె ముందుండి ప‌రిష్క‌రించేవారు. ఈ మండ‌లంలో అభ్య‌ర్థుల స‌మ‌స్య‌లు ఏవీ పెద్ద‌గా ఎమ్మెల్యే వ‌ర‌కూ వెళ్ల‌కుండానే ప‌రిష్కించేందుకు ప్ర‌య‌త్నించేవారు. దీంతో అంద‌రి వైసీపీ ఎంపీటీసీ అభ్య‌ర్థుల‌కు ఈమె న‌చ్చేశారు. ప్ర‌చారంలో ఎన్నిక‌ల కూడా జ‌నాల‌ను మెప్పించారు. అందుకే గెలుపు సునాయాసం అయిపోయింది.14 ఎంపీటీసీ స్థానాల‌కు గానూ 13మంది వైసీపీ అభ్య‌ర్థులు గెలిచారు కూడా.

ఉపాధ్యాయులు నుంచి జిల్లా ప‌రిష‌త్ అధ్య‌క్షురాలు వర‌కూ…


అరిబోరి సుభ‌ద్ర ఆదివాసీ తెగ‌కు చెందిన వ్య‌క్తే కాదు..ఓ సాధార‌ణ కుటుంబానికి చెందిన మ‌హిళ‌. ఉండేది ముంచంగిపుట్టులోనే అయినా రోజు వారి సంపాద‌న‌తోనే వారి జీవ‌నం సాగేది. ఈమె భ‌ర్త న‌ర‌సింహ‌మూర్తి. , మూర్తిది కుటుంబం తెలంగాణ‌కు చెందిన‌ది. మూర్తి వాళ్ల పూర్వీకులు ఎప్పుడో ఇక్క‌డ‌కు వ‌ల‌స వ‌చ్చేశారు. ఇక ఇక్క‌డే స్థిర‌ప‌డిపోయారు. అరిబోరి సుభ‌ద్ర ముంచంగిపుట్టులోని ల‌బ్బూరు చెందిన మ‌హిళ. ఎంఏ బీఈడీ పూర్తి చేశారు.ఈమె ముంచంగిపుట్టుకు చెందిన ఓ ప్ర‌యివేట్ పాఠ‌శాల‌లో టీచ‌ర్‌. ఈమెకు నెల‌కు 15వేలు జీతం. ఈమె భ‌ర్త మూర్తి త‌ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవ‌ర్‌. ఈయ‌కు రూ.10వేల జీతం. అర‌కు శాస‌న స‌భ్యులు చెట్టి ఫాల్గుణ అన్వేష‌ణ‌లో ఈమెను జెడ్పీటీసీ అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌డం…విజ‌యం సాధించ‌డం జ‌రిగిపోయాయి. అర‌కు శాస‌న స‌భ్యుల చాక‌చ‌క్యంగా ఈమెకు జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌విని ఇప్పిండంలో చ‌క్క‌టి చాక‌చ‌క్యం ప‌ద‌ర్శించారు. మొద‌టి నుంచి సుభ‌ద్ర‌ను చైర్ ప‌ర్స‌న్ చేసుందుకు వేసి ప్ర‌తి అడుగులోనూ విజ‌యమే క‌నిపించింది. వైసీపీ అధిష్టానాన్ని ఒప్పించ‌డంలో చెట్టి ఫాల్గుణ స‌ఫ‌ల‌మ‌య్యారు. అందులో గిరిజ‌న బిడ్డ‌లంతా ఈయ‌న‌కు కృత‌జ్ఞ‌తలు తెలుపుతున్నారు.

జెడ్పీ చైర్ పర్సన్ సుభద్రకు అభినందనల వెల్లువ‌


అతి సాధార‌ణ మ‌హిళ‌కు ద‌క్కిన గౌర‌వం ఇద‌ని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ వ్యాఖ్య‌

ముంచంగిపుట్టు జెడ్పీటీసీగా విజ‌యం సాధించిన జ‌ల్లిప‌ల్లి సుభ‌ద్ర జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్‌గా శ‌నివారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమెకు అభినంద‌న‌లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆమెకు వెన్నుద‌న్నుగా నిలిచిన శాస‌న స‌భ్యులు చెట్టి ఫాల్గుణ‌, గిరిజ‌నల నుంచి అభినంద‌న‌లు ల‌భించాయి.
గిరిజన తెగలోని ఎస్టీ పివిటిజి సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీ అరిబోరి సుభద్ర జిల్లా పరిషత్ చైర్ ప‌ర్స‌న్ ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మీడియాతో మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్ ప‌ర్సన్ విజయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గిరిజన ప్రాంత ఆదివాసులకు ఇస్తున్న ప్రాధాన్యత ఈ విజయంతో మరోసారి రుజువైందన్నారు. గిరిజన ప్రాంతంలోని అతి సాధారణ సామాజిక వర్గానికి చెందిన మ‌హిళ‌ల‌కు ఉన్నత పదవులను అలంక‌రింప‌జేశార‌ని పేర్కొన్నారు. గిరిజన ప్రాంత సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ తో పాటు, వారి ద్వితీయ కుమారుడు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వినయ్ గారు తదితరులు పాల్గొన్నారు.

Recommended For You

About the Author: దేవరాజు - బ్యూరో చీఫ్‌

కొప్పు శెట్టి దేవ‌రాజు- బ్యూరో చీఫ్‌.. జ‌ర్న‌లిజంలో 12ఏళ్ల అనుభ‌వం. చదువుతూ సంపాదించుకోవాల‌న్న దృక్ప‌థంతో 7వ త‌ర‌గ‌తి నుంచి పేప‌ర్ బాయ్‌గా జీవితం ప్రారంభించి మండ‌ల విలేక‌రిగా జ‌ర్న‌లిజం వృత్తిలోకి అడుగుపెట్టాను. మ‌ధ్య మార్గంలో ఈనాడు ప్ర‌క‌ట‌న‌ల విభాగం (రీటా)లోనూ, స‌ర్యూలేష‌న్ విభాగంలోనూ ప‌ని చేశాను. త‌ర్వాత ప్ర‌జాశ‌క్తి జ‌ర్న‌లిజం స్కూల్‌లో శిక్ష‌ణ పొంది అక్క‌డ జిల్లా డెస్క్ స‌బ్ ఎడిట‌ర్ రెండేళ్లు , ఆ త‌ర్వాత రాష్ట్ర కేంద్రంలో సినిమా విభాగం ఇన్‌చార్జిగా ఐదేళ్లు, దానికి ముందు సాక్షిలో మ‌రో 5ఏళ్లు స‌బ్ ఎడిట‌ర్‌గా ప‌ని చేశాను...

2 Comments

  1. సరైన సమయంలో ఆమె గురించి పూర్తి బయోడాటాతో పాటు ఆమె వ్యవహార శైలిని చక్కగా వివరించారు…ఐటెమ్ బాగుంది సర్…అలాగే ఊహాగానం వార్తను కూడా ముందుగా ప్రజంట్ చేసి జోస్యం నిజమయ్యేలా కృతకృత్యులయ్యారు…ధన్యవాదాలు దేవరాజ్ గారూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *