స్కీమ్ వర్కర్ల సమస్యలపై సమ్మె

Spread the love

తహ‌శీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా


అఖిల భారత స్కీమ్ వర్కర్ల సమ్మెలో భాగంగా పాడేరు తహ‌శీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి, ఆశ, సి హెచ్ డబ్ల్యు, వివోఏ,మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ విధులు నిర్వ‌హిస్తున్న కార్మికులను గ‌వ‌ర్న‌మెంట్‌ ఉద్యోగులుగా గుర్తించడం లేదని వారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లకు సంక్షేమ పథకాలు కోత పెడుతున్నదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స్కీమ్ వర్కర్ల అందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని కోరారు. జీవితంలో సగం పెన్షన్ రిటైర్మెంట్, బెనిఫిట్స్ రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా కల్పించాలని విన్న‌వించారు. విధుల్లో మరణిస్తున్న స్కీం వర్కర్లకు రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరి డిమాండ్ల కూడిన విన‌తి ప‌త్రాన్ని త‌హ‌శీల్దారుకు అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వి భాగ్యలక్ష్మి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు , వై. మంగమ్మ, వివోఎ లా డివిజన్ అధ్యక్షురాలు ఆర్.భాను, లీల, కుమారి,అంబిక,అంబాలమ్మ, దాసఅమ్మ తదితరులు పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *