విశాఖ జెడ్పీ రేస్ సుభ్ర‌ద‌

Spread the love

జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌటింగ్ త‌ర్వాత ఎంపీపీ, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ప‌ద‌వుల‌పై గురి ఉంటుంది. శుక్ర‌వారంతో ఎంపీపీ ప‌ద‌వుల ప్ర‌మాణ స్వీకారం జ‌రిగిపోయింది. ఇక జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్లు ఎవ‌రు అన్న‌ది తేలాల్సీ ఉంది. ఇప్పుడు విశాఖ జిల్లా ప‌రిష‌త్ పీఠంపై ఎవ‌రు కూర్చొనున్నారు అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌లా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ ప‌దవి రేసులో జీకే వీధి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన కిముడు శివ‌ర‌త్నం, జి. మాడుగుల నుంచి విజ‌యం సాధించిన జెడ్పీటీసీ స‌భ్యురాలు మ‌త్స‌రాస వెంక‌ట‌ల‌క్ష్మి, అర‌కు జెడ్పీటీసీగా గెలుపొందిన శెట్టి రోషిణి పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. నిన్న‌టి నుంచి మ‌రొక‌రి పేరు వినిపిస్తోంది.త‌నేవ‌రో కాదు ముంచంగిపుట్టు జెడ్పీటీసీ జ‌ల్లిబిల్లి సుభ‌ద్ర‌. ఒరిస్సా బోర్డ‌ర్‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న మండ‌లం ఇది. ఈ మండ‌లం నుంచి ఈమె సునాయాసంగా విజ‌యం సాధించారు. ఈ సారి ఆదివాసీ తెగ‌కు చెందిన మ‌హిళ‌నే జిల్లా ప‌రిష‌త్ పీఠంపై కూర్చొబెట్టాల‌ని వైసీపీ అధిష్టానం భావిస్తున్న‌ట్టుగా ప్ర‌స్తుతం ప్ర‌చారం జ‌ర‌గుతుంది.ఆ కోనంలో చూసుకుంటే జ‌ల్లిబిల్లి సుభ‌ద్రే ఆదీవాసీ తెగ‌కు చెందిన జెట్పీటీసీ.అయితే ముందు నుంచి ఎవ‌రి పేర్ల‌యితే జెడ్పీ కుర్చీ ద‌క్కించుకునేందుకు పావులు క‌దుపుతున్నారో వాళ్లు వైజాగ్‌లోనే మ‌కాం వేసి అధిష్టానంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. చూడాలి ఈ సారి ఈ పీఠం ఎవ‌రుకు ద‌క్కుతుందో…

Recommended For You

About the Author: దేవరాజు - బ్యూరో చీఫ్‌

కొప్పు శెట్టి దేవ‌రాజు- బ్యూరో చీఫ్‌.. జ‌ర్న‌లిజంలో 12ఏళ్ల అనుభ‌వం. చదువుతూ సంపాదించుకోవాల‌న్న దృక్ప‌థంతో 7వ త‌ర‌గ‌తి నుంచి పేప‌ర్ బాయ్‌గా జీవితం ప్రారంభించి మండ‌ల విలేక‌రిగా జ‌ర్న‌లిజం వృత్తిలోకి అడుగుపెట్టాను. మ‌ధ్య మార్గంలో ఈనాడు ప్ర‌క‌ట‌న‌ల విభాగం (రీటా)లోనూ, స‌ర్యూలేష‌న్ విభాగంలోనూ ప‌ని చేశాను. త‌ర్వాత ప్ర‌జాశ‌క్తి జ‌ర్న‌లిజం స్కూల్‌లో శిక్ష‌ణ పొంది అక్క‌డ జిల్లా డెస్క్ స‌బ్ ఎడిట‌ర్ రెండేళ్లు , ఆ త‌ర్వాత రాష్ట్ర కేంద్రంలో సినిమా విభాగం ఇన్‌చార్జిగా ఐదేళ్లు, దానికి ముందు సాక్షిలో మ‌రో 5ఏళ్లు స‌బ్ ఎడిట‌ర్‌గా ప‌ని చేశాను...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *