పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకురావాలి

Spread the love

భారీగా పెంచిన పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్ ధ‌ర‌ల‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకువాల‌ని ఆంధ్ర ప్రదేశ్ ఆటో మోటర్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) డిమాండ్ చేసింది. భార‌త్ బంధ్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సంఘం రాష్ట్ర సమితి మ‌ద్ద‌తు తెలుపుతూ శుక్ర‌వారం అన‌కాప‌ల్లి రామచంద్ర థియేటర్ అంబేద్కర్ విగ్రహం ముందు ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ , వంట గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ఆటో మోటర్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను భారీగా పెంచి ప్రజలపై ఆర్థిక భారాలను మోపుతుంద‌ని చెప్పారు. దేశంలో బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ రవాణా రంగంపై ఆర్థిక భారాన్ని వేస్తుందని విమ‌ర్శించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్, ధరలు తగ్గించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
డీజిల్ పెట్రోల్ ధరలు మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సెస్,
వ్యాట్ పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల‌ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్న గోతులను
రోడ్లును పక్కాగా వేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని విన్న‌వించారు. ప్రైవేట్ ఫైనాన్షియర్లు
వేస్తున్న అధిక వడ్డీలను రద్దు చేయాలని కోరారు. ఆటో, మోటార్ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటోలను ఫొటోలు తీస్తున్న పోలీస్ ఇ- చలానాలను రద్దు చేయాలని కోరారు. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ఆర్టీవో పన్నులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నం పెట్టే రైతున్నకడుపు కొట్టి వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేయుటకు బీజేపీ ప్రభుత్వం చేసిన మూడు నూతన వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయాలని చెప్పారు. ఈనెల27న జరిగే భారత బంద్ లో ఆటో, మోటార్ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని రైతాంగం,
ఉద్యోగ, కార్మిక వర్గానికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు వై.ఎన్ భద్రం, ఆటో సంఘం నాయకులు కొరిబిల్లి జగదీష్, నారాయణ, మత్తుర్తి సూరిబాబు,
బోయిన నాయుడు, బద్దల శ్రీను, కొయ్య నాగేంద్ర, గొలగానీ, లోకేష్, నంబారి శేషు, సీపీఐ నాయకులు కొరిబిల్లి శంకర్రావు, బుర్ల సూరినారాయణ, కొమ్మనాపల్లి వెంకటరమణ,నారాయణ తదితరులుపాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *