మాక‌వ‌రం స‌ర్పంచ్ నిర‌స‌న

Spread the love

త‌న‌ను అవ‌మానించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ
అనకాపల్లి మండలంలోని మాకవరం సర్పంచ్ మోయ్య భ‌వాని నిర‌స‌న తెలిపారు. త‌న‌ను అవమాన పరిచిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రా కేసు నమోదుచేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికరామచంద్ర థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలతో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆమె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ భవాని అవమానపరిచిన ఎమ్మెల్యే, అతని అనుచరులను తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కోన లక్షణ , దళిత బహుజన సంఘాల ఐక్యవేదిక నాయకులు బోనీ గణేష్, సబ్బవరపు గణేష్, మైలపల్లి పోతురాజు, చెవ్వేటి నూక అప్పారావు, కొల్లి.సత్యరావు, మహిలు పాల్గొన్నారు.

Recommended For You

About the Author: దేవరాజు - బ్యూరో చీఫ్‌

కొప్పు శెట్టి దేవ‌రాజు- బ్యూరో చీఫ్‌.. జ‌ర్న‌లిజంలో 12ఏళ్ల అనుభ‌వం. చదువుతూ సంపాదించుకోవాల‌న్న దృక్ప‌థంతో 7వ త‌ర‌గ‌తి నుంచి పేప‌ర్ బాయ్‌గా జీవితం ప్రారంభించి మండ‌ల విలేక‌రిగా జ‌ర్న‌లిజం వృత్తిలోకి అడుగుపెట్టాను. మ‌ధ్య మార్గంలో ఈనాడు ప్ర‌క‌ట‌న‌ల విభాగం (రీటా)లోనూ, స‌ర్యూలేష‌న్ విభాగంలోనూ ప‌ని చేశాను. త‌ర్వాత ప్ర‌జాశ‌క్తి జ‌ర్న‌లిజం స్కూల్‌లో శిక్ష‌ణ పొంది అక్క‌డ జిల్లా డెస్క్ స‌బ్ ఎడిట‌ర్ రెండేళ్లు , ఆ త‌ర్వాత రాష్ట్ర కేంద్రంలో సినిమా విభాగం ఇన్‌చార్జిగా ఐదేళ్లు, దానికి ముందు సాక్షిలో మ‌రో 5ఏళ్లు స‌బ్ ఎడిట‌ర్‌గా ప‌ని చేశాను...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *