ఆచార్య విడుద‌ల వాయిదా

Spread the love

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం ఆచార్య‌. ఈ చిత్రాన్ని మే 13న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా దేశంలో నెల‌కొన్న కొవిడ్ సెకండ్ వేవ్ ప‌రిస్థితుల కారణంగా సినిమా విడుద‌లను వాయిదా చేస్తున్న‌ట్లు , ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే సినిమా విడుద‌ల తేదీకి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిస్తామ‌ని
నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు.
న‌టీన‌టులు:
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే, సోనూసూద్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: కొర‌టాల శివ‌
బ్యాన‌ర్స్‌: కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత‌లు: నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్‌
మ్యూజిక్‌: మణిశ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సురేష్ సెల్వరాజ్‌
ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *