వ్యవసాయ, చేపల ఉత్పత్తులపై ఎంపీ సత్యవతి పలు ప్రశ్నలు

Spread the love

చేపలు, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించి అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతి లోక్ సభలో మంగళవారం పలు ప్రశ్నలు లేవనెత్తారు. మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. గత పదేళ్లలో దేశం మొత్తం మీద సముద్ర చేపల ఉత్పత్తి, ఆధునిక ఫిషింగ్ కు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తెలపాలని కోరారు. దీనికి సంబంధిత శాఖ మంత్రి ప్రతాప్ చంద్ర బదులిస్తూ మత్స్యకారుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో మత్స్య పశుసంవర్ధక , పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అనేక సంవత్సరాలుగా కృషి చేస్తోందన్నారు. 2015-20 లో మధ్య నీలి విప్లవం మత్స్య సంపద సమగ్ర అభివృద్ధి నిర్వహణ పథకాన్ని నిర్వహించిదన్నారు. 20,050 కోట్ల పెట్టుబడితో రానున్న ఐదేళ్లలో మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం దేశంలో ఉత్పత్తి చేసి విక్రయించే సేంద్రియ ఉత్పత్తుల మొత్తం విలువ తెలపాలని ఎంపీ గారు ప్రశ్నించారు. ఏపీ నుంచి సేంద్రియ ఉత్పత్తుల ఉత్పత్తి ఎగుమతులు పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలిపాలన్నారు. దీనికి మంత్రి నరేంద్ర సింగ్ బదులిస్తూ ఆంధ్రప్రదేశ్లో 5300 డస్టర్లలో 1.06 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ పరంపరగట్ కృషి వికాస యోజన సహాయంతో చేపట్టినట్లు వివరించారు. ఇలాంటి కార్యక్రమంలో అనేకమైనవి చేపట్టామంటూనే ఎగుమతుల ప్రోత్సాహం కోసం ఏపీ ఈ డి ఎ ద్వారా గ్రేటర్ నోయిడాలోని ఇంటర్నేషనల్ ఎక్స్పో మార్క్ లిమిటెడ్ 2019లో నార్నెబర్గ్ మెస్సీ ఇండియా సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించమనారు. ఉత్పత్తులు ఎగుమతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు నిర్వహిస్తుందన్నా రు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *