ఎన్నికల్లో గెలిచేందుకు విజయసాయి కుయుక్తులు

Spread the love

ప్రతిపక్ష అభ్యర్థులకు భారీ ఆఫర్?
జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం ఆరోపణ

విశాఖలో వైసీపీని గెలిపించే బాధ్యతను భుజానకు ఎత్తుకున్న విజయసాయిరెడ్డి అక్కడ చేస్తున్న రాజకీయ కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు ఓట్లు వేస్తే వైసీపీ అభ్యర్థులు గెలుస్తారో లేదోనన్న సందేహం గట్టిగా ఉందేమో కానీ.. ఇతర పార్టీల అభ్యర్థుల్ని పోటీ నుంచి తప్పించడానికి చేయాల్సిందంతా చేస్తున్నారు అని పోటీ నుంచి వైదొలిగే అభ్యర్థికి రూ. కోటి ఆఫర్ చేస్తున్నారని జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం ఆరోపించారు.సోమవారం స్ధానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయం దారుణంగా ఉందని… అయితే పోలీసులు లేకపోతే డబ్బుల్ని ఉపయోగించి రాజకీయం చేస్తున్నారని అన్నారు. మరో వైపు కుల సమీకరణాల్ని వైసీపీకి అనుకూలంగా మార్చేందుకు కుల సంఘాల భేటీలు ఏర్పాటు చేస్తున్నారు అన్నారు. వైసీపీకి రెడ్డి సామాజికవర్గం అండగా ఉంటుందిఅని కానీ. ఉత్తరాంధ్రలో ఆ సామాజికవర్గం తక్కువ ఉన్నందున రెడ్డిక అనే మరో బీసీ సామాజికవర్గాన్ని రెడ్డిల్లో కలిపేసి.. కుల సమావేశం నిర్వహించారు అన్నారు.. నిజానికి రెడ్డిక అనేది బీసీ సామాజికవర్గం. కోస్తా, సీమ రెడ్లకు.. ఉత్తరాంధ్ర రెడ్డికలకు అసలు సంబంధమే లేదు. అయినప్పటికీ.. వైసీపీకి కులం బలం కల్పించడానికి రెడ్డికలను రెడ్లుగా సంబోధిస్తూ.. స్టార్ హోటల్లో భారీ ఖర్చుతో విందు ఏర్పాటు చేసి.. రెడ్డికలు అందరూ వైసీపీకే ఓటేయాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు అని. ఆయన పిలుపు కూడా విచిత్రంగా ఉందని ఎద్దేవాచేశారు. వైసీపీ ఎక్కువ మంది అభ్యర్థుల్ని రెడ్డికల్ని నిలబెట్టకపోయినా టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టినా… కుల పక్షపాతం చూపించకుండా వారంతా వైసీపీకే ఓటు వేయాలని విజయసాయిరెడ్డి కోరారు. రెడ్డికలు కులపక్షపాతంతో ఓటు వేస్తారన్నట్లుగా ఆయన మాట్లాడారు. అసలు విజయసాయిరెడ్డి ఎందుకింత హడావుడి చేయడాన్ని అందరూ గమనిస్తున్నారని అన్నారు. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ లేదని చెప్పే ప్రయత్నం విజయసాయి చేస్తున్నారని అన్నారు.నిజంగా సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ధీమా ఉంటే ఈ తతంగం అంతా ఎందుకని సీతారాం విజయసాయి ని ప్రశ్నించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *