
సిపిఐ హెచ్చరిక
ఆస్తి విలువ ఆధారం ఇంటి పన్నులను, చెత్త సేకరణ పన్నులను అసాధారణంగా పెంచితే జగన్ ప్రభుత్వం పతనం తప్పదని సీపీఐ నాయకులు వై.ఎన్ భద్రం హెచ్చరించారు. ఇంటి అద్దె విలువ ఆధారంగా విధించే ఇంటి పన్నులను రిజిస్టర్ ఆఫీసులో గవర్నమెంట్ నిర్ణయించిన ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచాలని ప్రభుత్వం ఆర్డినెన్స్ లు తీసుకొచ్చి ప్రజలపై పెనుభారం మోపాలని చూస్తుందని, ఇప్పటికే ఇంటి పన్నులు చెల్లించలేక గృహ యజమానులు సతమతమవుతుంటే ప్రభుత్వం కొత్త విధానం అమలు జరిపితే 20రేట్లుపన్నులు పెరిగి యజమానులు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో ఒక చేతిలో ఇచ్చి ప్రభుత్వం రెండు చేతులతో ప్రజల నుండి గుంజాలని చూస్తుందని అని విమర్శించారు. అంతేకాక చెత్త సేకరణ పేరుతో కూడా ఇంటి యాజమాన్యాలు నుండి పన్నులు వసూలుకు పూను కుంటుందని, సేవలు అందించవలసిన ప్రభుత్వం పట్టణ, నగర ప్రజలపై పన్నుల తోపెనుభారం మోపితే జగన్ ప్రభుత్వానికి పతనం తప్పదని ఇప్పటికైనా ప్రభుత్వం పన్నుల ఆర్డినెన్సులను వెనకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.