
తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న కొత్త మునిసిపల్ స్థానిక పన్నుల విధానం ప్రజల మీద భారం మోపుతోందని ,జీఓ నెంబర్190 ఈ విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యాక్షులు మళ్ళ సురేంద్ర డిమాండ్ చేశారు. నగరాలు ,మున్సిపాలిటీస్ ,కార్పొరేషన్లో ప్రజలందరిపై ఆర్థిక భారాన్ని మోపుతూ ఇల్లు ,షాపులు ,నీటి పన్ను అమాంతంగా ఒకేసారి పెంచుకునేలా ఈ జీవో ను రూపొందించారన్నారు. ఆర్థికంగా ఇప్పటికే దెబ్బతిన్న వ్యాపారులను, నిర్మాణ రంగాన్ని ఇంకా కుదేలు చేసే విధంగా ఉన్నా ఈరోజు మునిసిపల్ మంత్రి కొత్తగా పెంచిన పన్ను విధానంలో 350 చదరపు అడుగులు పైన నివాసాలకు సంపన్నుల తరహాలో పన్ను మోపడం సరికాదన్నారు . ౩౦౦-350 చదరపు అడుగులు పైన ఇల్లు ఉన్నవారు సంపన్నులైతే , దేశమంతా 405 చదరపు అడుగులు నివాసాలకు కూడా పేదవారిని చెప్పి ప్రభుత్వం నిధులుు ఏ విధంగా ఇస్తుందని ప్రశ్నించారు. అవగాహన లేకుండా తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల ప్రజల ఆదాయాలు లెక్కించకుండా పన్నులు విధించడం సరికాదని తెలిపారు. ఇది వరకు అద్దె విలువ మీద పన్నులు కట్టే వాళ్ళమని ఇప్పుడు జీ ఓ. 190 ప్రకారం అస్తి విలువ మీద పన్ను వేస్తారని దాని వలన ఒకేసారి భారీగా పన్నులు కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు .
ఒకే జిల్లాలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంత్రిత్వ శాఖ పేదవారిని చెప్పి ఆడుకుంటే , మరో మంత్రిత్వ శాఖ వారి పై పన్నులు వేయడం దేనికి సంకేతమని , ఒక చేతితో డబ్బులు పెట్టి మరో చేతితో లాగుకోవడం మానుకోవాలని సూచించారు. ప్రజలపై పన్నులు బదులు ,అనవసర అప్పులు ఆపి వేరు ఆదాయ మార్గాలు మున్సిపాలిటీస్ పెంచుకోవాలని సురేంద్ర పేర్కొన్నారు.