21న వైయస్సార్ క్రికెట్ టోర్నీ

Spread the love

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21న జన్మదినం సందర్భంగా జీవీఎంసీ 98వ వార్డులో వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. దానిలో భాగంగా జీవీఎంసీ 84 వాటి పరిధిలో లక్ష్మీ నారాయణ్ నగర్ లోస్కేటింగ్ గ్రౌండ్ వద్ద రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శి పలక రవి టోర్నమెంట్ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6 నుండి క్రికెట్ జట్ల ఎంపిక జరుగుతుందన్నారు. ఈనెల21 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ప్రజలకు చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా అమలు చేస్తున్నారని అని తెలియజేశారు. ఈ టోర్నమెంట్లో 15 సంవత్సరాలు దాటిన క్రీడాకారులు పాల్గొనవచ్చని చెప్పారు. ఈ టోర్నమెంట్కు ఇటువంటి ప్రవేశ రుసుము లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ పట్టణ కార్యదర్శి కోరుకొండ రాఘవ కలిపి నాలుగో వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి యశోదయుపి ఎఫ్ చైర్మన్ యోహాన్ ఫాస్ట్ఉగ్గిన శ్రీనివాసరావు . టి సి సి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *