
ప్రభుత్వ పథకాలను వికలాంగులకు వర్తింపజేసేటప్పుడు వారి వ్యక్తిగత ఆదాయంలతో పోల్చవచ్చుగానీ కుటుంబ ఆదాయంతో పోల్చవద్దని చోడవరం మండల వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుగ్గిరాల వెంకట రవికుమార్ అన్నారు. ప్రపపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో శ్యామ్‌కు అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వికలాంగుల కోసం రూపొందించిన 2016 చట్టాన్ని ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన కోరారు. పింఛన్లు ఏరివేత ప్రక్రియ చేపడుతున్నప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాక తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన చెప్పారు. వివాహం కానీ వికలాంగులకు కూడా రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. షరతుల విధించకుండా వికలాంగులకు పరికరాలను అందించాలని ఆయన కోరారు.