
అనకాపల్లి నియోజవర్గం ఇటీవల నివర్ తుఫాన్ల వల్ల తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలు చూడ లేదని కనీసం రైతాంగాన్ని ఓదార్పు చేయలేని స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ రైతాంగం కోసం రైతు ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడిపై విమర్శ చేసే స్థాయి లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొణతాల వెంకటరావు ధ్వజమెత్తారు. వర్షాలకు, తుఫాన్లకు నియోజవర్గంలో రోడ్లు నడవలేని స్థితిలో ఉన్నాయని ఎక్కడికక్కడ గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కనీసం గుంతలు పూడ్చలేని అమర్ బషీర్బాగ్ కాల్పులు గురించి పెద్ద పెద్ద అర్భాటపు ప్రకటనలు ఇవ్వడం తగదని వెంకటరావు అన్నారు. ఈ పద్దెనిమిది మాసాల్లో టిడ్కో గృహాలను సందర్శించి వాటికి కనీస మౌలిక సదుపాయాలు చూసింది చేసింది లేదని కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేని అసమర్థుడని అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం దురదృష్టకరమని అన్నారు. రూ.600 కోట్లతో అనకాపల్లి అందాలు పత్రికా ప్రకటనల కే పరిమితం అవుతున్నారు తప్ప కార్యాచరణలో చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. పట్టణ ఉపాధ్యక్షులు కుప్పిలి జగన్ మాట్లాడుతూ తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ని ఆధునీకరణ పేరుతో ఓట్లు దండుకుని ఫ్యాక్టరీ వంక చూడకుండా రైతులు కార్మికులు విషయాలు పట్టించుకోకుండా కనీసం కార్మికుల జీతాలు చెల్లించడానికి ప్రయత్నం చేయకపోవడం విచారకరమన్నారు. వార్డ్ అధ్యక్షులు మారిశెట్టి శంకర్రావు మాట్లాడుతూ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉనికి ప్రశ్నార్థకం చేసే విధంగా 50 ఎకరాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే ముందు ఈ ప్రాంత రైతులు రైతు సంఘాల వారితో అఖిలపక్ష రాజకీయ పార్టీలతో శాసనసభ్యులు అమర్ కనీసం సంప్రదింపులు చేయకపోవడం విచారకరమని ఏకపక్షంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. గతంలోనే కొన్ని ప్రతిపాదనలు రావడం జరిగిందని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మిగులు భూములు ఉంటే ఇవ్వాలని గతంలో ప్రతిపాదనలో చేశారని 30 ఎకరాలు ఇస్తే కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిపాదిస్తే దీనికి పరిశోధన కేంద్రం అధికారులు అంగీకరించలేదు దీంతో బుచ్చి పేట మండలం కొండేపూడి గ్రామంలో విజ్ఞాన కేంద్రం తరలి వెళ్లిందని ఆరోపించారు. బొడ్డేడ మురళి మాట్లాడుతు ఉద్యాన పరిశోధన కేంద్రం విషయంలో కూడా ఆర్ఏఆర్ఎస్ అధికారులు అంగీకరించలేదని దీనివల్ల టీ. వెంకుపాలెం లో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అధికారుల ప్రమేయం లేకుండా ఏకపక్షంగా రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి పరిశోధన కేంద్రంలో 50 ఎకరాలు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమంటే వ్యవసాయ పరిశోధనలకు మంగళం పాడినట్లు లేనని తెలిపారు.