
పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ డిమాండ్ చేసింది. గురువారం స్థానిక ఆర్ డివో కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ జయశ్రీ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వై.ఎన్.భద్రం మాట్లాడుతూ ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి పోయాయని కరోనా నేపథ్యంలో పనులులేక పేదలు, కూలీలు ఏమికొనలేక తినలేక ఆర్థికలితో అలయటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పప్పుల ధరలను కూడా (రేషన్ షాపులలో) అర్దాంతరంగా పెరిగిపోయాయని ప్రస్తుతం వంటగ్యాస్ పై కేంద్రప్రభుత్వం రూ.50 పెంచడం గోరుచుట్టు పైరోకలిపోటు అన్న చందంగా ఉందన్నారు. నిత్యావసర సరుకులధరలు తగ్గించడంతోపాటు పెంచిన వంటగ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీనాయకులు నాయుడు మల్లికార్జున రావు, కొరిబిల్లి శంకరరావు, బొడ్డేడ ముసిలినాయుడు, కోనలక్ష్మణ, కర్రిసూర్య నారాయణ, మత్తుర్తి సూరిబాబుతదితరులు పాల్గొన్నారు.